ఇప్పుడు తెలంగాణ‌లో ఎవ‌రి నోట విన్నా మోడీ టూర్ గురించే చ‌ర్చ‌. టీఆరెస్ ఎదురుదాడి గురించే టాపిక్‌. ఈ రెండు పార్టీల కుమ్ములాట‌ల గురించే కామెంట్స్‌. ఈ ధ్యాస‌లో ప‌డి ఎవ‌రూ కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో నువ్వా నేనా అని పోటీ ప‌డుతున్న పార్టీలు ఈ రెండే క‌నిపిస్తున్నాయి. మొన్న‌టి దాకా జ‌రంత దూకుడు మీద క‌నిపించి ఆపై కనుమ‌రుగైపోయింది కాంగ్రెస్‌. బీజేపీ, టీఆరెస్ నువ్వా నేనా అని కొట్లాడుతున్నాయి. మోడీ హైద‌రాబాద్ రాక వీటి మ‌ధ్య మ‌రింత కాకా పెంచింది. మ‌ధ్య‌లో కాంగ్రెస్‌ను ప‌ట్టించుకున్న‌వాడు లేడు.

తాము కూడా ఉన్నామ‌ని చెప్పుకోవ‌డం కోస‌మో…. క‌నీసం చ‌ర్చ‌లో కాంగ్రెస్ కూడా మ‌ధ్య‌లో క‌లుగ‌జేసుకుంటే బాగుంటుంద‌నుకున్నారో… మాకు మోడీ కాదు… టీఆరెస్‌ను తిట్ట‌డం ముఖ్య‌మ‌ని భావించారో తెలియ‌దు కానీ… ఇలా మోడీని తిడుతూ పెట్టిన పోస్ట‌ర్‌ను సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు అన్వ‌యిస్తూ మార్ఫింగ్ చేసి వ‌దిలేశారు సోష‌ల్ మీడియాలో. అంతే మీరు షేర్ అయితే మేము స‌వ్వా షేర్ అని ఇలా జ‌బ్బ‌లు చ‌ర్చుకుంటున్నారు. ఏమాట‌కామాటే… మ‌రీ రాజ‌కీయాలు ఇలా దిగ‌జారిపోయాయేంద‌బ్బా…!!

You missed