రాయలసీయ సినిమా కథల్లో…. ఫ్యాక్షన్ మర్డర్ స్టోరీలలో ఇలాంటివి విని వుంటాము. ఎక్కడో జరిగే సన్నివేశాలను చూశాం కానీ ఇక్కడే మన దగ్గర కూడా ఇలాంటివి పురుడుపోసుకుని స్వేచ్చగా మర్డర్ రాజకీయాలు పెరిగి పెద్దవవుతాయని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఆర్మూర్ ఇందుకే కేంద్రంగా మారింది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇప్పుడే కాదు… ఎప్పడూ వార్తల్లో వ్యక్తే. ఇప్పుడు తాజాగా అతని ప్రధాన అనుచరుడి మర్డర్ పాలిటిక్స్‌తో జీవన్ రెడ్డి మరోసారి తెరపైకి వచ్చాడు. జీవన్‌రెడ్డితో పెట్టుకుంటే టిప్పర్‌తో టక్కర్ ఇచ్చి చంపుతాడని ప్రతీతి. అంతా ఇదే చర్చించుకుంటారు. దళిత యువకుడు తలారి సత్యాన్ని అలాగే టిప్పర్‌తో ఢికొట్టి చంపేశాడనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఇది చర్చించుకుంటారు.
అదే తరహాలో జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ మొన్న మాక్లూర్ సాక్షి విలేకరి పోశెట్టిని తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని ఈ మహేందర్ గ్యాంగ్ చంపే ప్రయత్నం చేసింది. గ్రామస్తులు అడ్డురావడంతో తృటిలో పోశెట్టికి ప్రాణహాని తప్పి గాయాలపాలయ్యాడు. ఈ కేసులో మహేందర్ దోషిగా తేల్చలేదు. బాహాటంగా బయట తిరిగాడు. ఇప్పుడు నందిపేట ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్‌లను చంపేందుకు (అంతా టీఆరెస్ పార్టీయే) రౌడీలకు 10 సుపారీ ఇచ్చాడు. దీనిపై ముందస్తు సమాచారం రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మర్డర్ కేసు మధ్యంతరంగా ఆగిపోయింది. లేకపోతే … ఫ్యాక్షన్ తరహా .. టిప్పర్‌తో ఢికొట్టి మరీ ఇద్దరినీ చంపేందుకు అంతా రంగం రెడీ అయింది. ప్రతిపక్షాలు ఈ ఫ్యాక్షర్ రాజకీయాలపై విరుచుకుపడుతున్నాయి. మాట్లాడితే కవితక్క, రామన్న అనే జీవన్‌రెడ్డి ఇలా రౌడీ, ఫ్యాక్షన్, మర్డర్ రాజకీయాలకు ఊతమివ్వడం పార్టీకి కాదు.. అగ్ర నాయకులకూ తలవంపే అనే చర్చ ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో నడుస్తుంది.