ఆర్మీ రిక్రూట్ అభ్యర్థుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వ విధానాలకు
అద్దం పడుతోంది..!

బీహార్ నుండి తెలంగాణ వరకు
యువతలో ఏర్పడిన ఆగ్రహావేశాలకు
కేంద్ర ప్రభుత్వమే కారణం.

సైన్యంలో తాత్కాలిక సైనికుల నియమకం
దేశ భధ్రతకు ప్రమాదం..!

17 సంవత్సరాల నుండి 21 సంవత్సరం వరకు అగ్నిపథ్ ద్వారా నియామకపు వయస్సుకు నిబంధనాలు విధించడం మూలంగా ఇంటర్ పూర్తి చేసి సైన్యంలో చేరిన యువకులు 21 సంవత్సరాల వయస్సులో ఇంటికి తిరిగొచ్చిన అనంతరం వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు దక్కుతాయో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.
ప్రభుత్వం చెప్పేది ఏమిటంటే స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తామని. అసలు బ్యాంకులు ఎవరికి రుణాలు ఇస్తాయో ప్రజలకు తెలియంది కాదు. దేశం కోసం సరిహద్దుల్లో సేవలు అందించేందుకు వెళ్లిన వీర జవాన్లకు ఉపాధి గ్యారెంటీ లేని ఉద్యోగం ద్వారా వారి భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా ఉంది కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ విధానం. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది.

★ నాడు రైతులు, నేడు ఆర్మీ రిక్రూట్ అభ్యర్థులు
మోదీ ప్రభుత్వ విధానాన్ని
ప్రతిఘటించిన తీరు..!

ఆఖరికి ఆర్మీని కూడా ఔట్ సోర్సింగ్ కార్మికులుగా
మార్చేందుకు సిద్ధపడ్డారు మోదీ గారు.
ఈరోజు దేశ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే
సరిహద్దుల్లో భారతీయ జవాన్లు కంటికి రెప్పలా
దేశ భధ్రతను కాపడ్డంమూలంగానే.

అలాంటి సైన్యంలో నాలుగు సంవత్సరాల కోసం
తాత్కాలిక సైనికులను నియమించడం ద్వారా
దేశ భధ్రతకు ముప్పు పొంచిఉంటుంది.
సైనికులకు ఇచ్చే జీతాలను సైతం వ్యాపార దృష్టితో చూస్తున్న బిజెపి నాయకుల ఆర్థిక విధానాల మూలంగా భవిష్యత్తులో భారతదేశం శత్రు దేశాలతో పెద్ద ప్రమాదం ఎదుర్కునే ప్రమాదం ఉంటుంది.
దేశంలో నిరుద్యోగ యువతలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా నిలుస్తుంది
దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళన.

★ ప్రజాస్వామ్య వ్యవస్థలో
ప్రజలే న్యాయ నిర్ణేతలు.
గతంలో ఏ ప్రభుత్వమైనా ఒక విధానం ప్రవేశపెట్టే ముందు ఆయా రంగంలోని నిష్ణాతులైన నిపుణులతోనూ, ప్రధాన ప్రతిపక్షాలతోనూ లేదా అఖిలపక్షంతో చర్చించే ఆనవాయితీ ఉండేది.

★ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో నియంతృత్వ పోకడలు ప్రదర్శించినప్పుడు
ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా తగిన గుణపాఠం నేర్పిన విషయం తెల్సిందే.

★ బిజెపి నాయకులు శాశ్వతంగా అధికారంలో ఉంటామనే భ్రమల్లో ఉండవచ్చు.
కానీ అది సాధ్యం కాదనే విషయం బిజెపి నాయకులు చరిత్ర చెప్పిన పాఠాలను గుర్తుంచుకోవాలి.
ఒకవేళ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు కోరుకుంటే,ప్రజలు ఈవీఎంల ద్వారా కాకుండా
బ్యాలెట్ ద్వారా ఓటేస్తే బిజెపి నాయకులు ఎంతకాలమైన అధికారంలో ఉండవచ్చు.
కానీ బిజెపి నాయకులు అలా చేయడం లేదు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు అయినటువంటి
ప్రశ్నను సహించ లేకపోవడమే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన పరిణామం.

★ తమను వ్యతిరేకించే సాధారణ ప్రజల నుండి ప్రజాస్వామ్యవాదులు, తటస్థ మీడియా, రచయితలు,కవులు, ఆఖరికి ప్రధాన ప్రతిపక్షాలను సైతం ఈడీ,సిబిఐ తదితర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేశారు. ముఖ్యంగా గుజరాత్ గుత్తపెట్టుబడిదార్లకు, దేశ సంపదను అప్పగించారని దేశం కోడై కూస్తున్న విషయం తెల్సిందే.

★ రేపు కేంద్రంలో అధికారంలోకి ఇతర పార్టీల ప్రభుత్వాలు వస్తే
బిజెపి నాయకులు అమ్మేసే ప్రభుత్వ రంగ సంస్థల పై విచారణ జరిపితే అప్పుడు బిజెపి నాయకుల పరిస్థితి ఏంటి..? రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు పోరాడిన వారిపై కేంద్ర ప్రభుత్వం చేయని కుట్రలేదు, ఆఖరికి వారిని దేశ ద్రోహులనే ముద్ర వేశారు. దేశ భవిష్యత్తుకు సంపదైనా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యంలేని బిజెపి కేంద్ర ప్రభుత్వం, సర్వ రంగాలను ప్రైవేటీకరణ చేసి సామాజిక బాధ్యతనుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది.

ఇప్పటికే బ్యాంకులు,పోస్టల్, ఎల్ఐసి, రైల్వే మార్గాలు, జాతీయ రహదార్లు,ఓడరేవులు,
విమానయాన సంస్థలు ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్ని ప్రైవేటీకరణ చేసిన బిజెపి కేంద్ర ప్రభుత్వం,ఇప్పుడు ఏకంగా దేశ రక్షణ రంగంలోని కీలకమైన సైన్యంను సైతం కాంట్రాక్టు ఉద్యోగులుగా నాలుగు సంవత్సరాలు తీసుకోవాలని నిర్ణయించడం దుర్మార్గపు చర్యగా ప్రతీ భారతీయుడు భావించాలసిన విషయం ఎంతైనా ఉంది.

అగ్నిపథ్ స్కీం కు వ్యతిరేకంగా ఆర్మీ రిక్రూట్ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి ప్రతి భారతీయుడి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ…

జైభీం లాల్ సలాంలతో…

దండి వెంకట్
బహుజన లెఫ్ట్ పార్టీ-BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్.18-2022

You missed