రెడ్ల ఆధిపత్యంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆపార్టీలోనే దుమారం రేపాయి.దీనిపై మధుయాష్కీ స్పందించాడు. ఇది దారుణమన్నాడు. వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలనే రేంజ్‌లో మీడియా ముందుకు వచ్చాడు. యాష్కీ చర్యలు పూర్తిగా అనాలోచితమని, తనను తాను హీరోగా ఎలివేట్ చేసుకోవడం కోసం పార్టీ ప్రతిష్టను బజారును పెట్టే విధంగా వ్యవహరించాడనే కామెంట్లు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ఇది పూర్తిగా అంతర్గత చర్చ అయినప్పటికీ బాహాటంగా మీడియా ముందుకు వచ్చి ఇ లా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్టు కాదని ఆ పార్టీ మెజార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ కొత్త పరిణామాలు ఆ పార్టీలో కొత్త కలకలాన్ని రేపుతున్నాయి. రేవంత్ ఎక్కడో కుల సంఘంలో మాట్లాడిన మాటలను వక్రీకరించి పార్టీని డ్యామేజ్ చేస్తున్నారనే భావనలో ఆ పార్టీ వర్గాలున్న సమయంలో ఓ కీలకమైన పదవిలో ఉన్న మధుయాష్కీ ఇలా అనాలోచితంగా పీసీపీ చీఫ్‌పైనే కామెంట్లు చేయడం పార్టీని మరింత నష్టపరిచే చర్య కాదా..? అని మండిపడుతున్నారు. ఇది అంతర్గతంగా చర్చించాల్సిందని, అవసరమైతే వీడియో పుటేజీతో రాహుల్ సమక్షంలో మాట్లాడాల్సి ఉండేనని, కానీ మధుయాష్కీ తనను తాను హీరో చేసుకోవడం కోసం ఇలా పీసీసీ చీఫ్‌ను చీప్ చేయడం ద్వారా పార్టీని పరోక్షంగా ప్రత్యక్షంగా చీప్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.