రేవంత్ ను ఆవ‌హించి ఉన్న రెడ్డి కుల పిచ్చి అప్పుడ‌ప్పుడు ఇలా బ‌య‌ట‌డ‌ప‌డుతూ ఉంటుంది. అది అంత‌ర్గ‌త చ‌ర్చ అయినా.. బ‌హిరంగ వేదిక అయినా.. మ‌న‌సులోని ఆ కుల‌పిచ్చి ఇలా అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి తాండ‌వం చేసి … మంచిగా ఉన్న వాతావ‌ర‌ణాన్ని క‌ల‌గాపులగం క‌లుషితం… క‌ల్మ‌షం చేపి పోతూ ఉంటుంది. అయినా మ‌నోడు మారడు. ఆనాడు ఓటుకు నోటు కేసులో త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట పెట్టుకున్నాడు. తెలంగాణ‌లో రెడ్ల రాజ్యం రావాల‌న్నాడు. రెడ్లే ఏలాల‌న్నాడు. దీని కోస‌మే త‌ను ప‌ని చేస్తున్నాన‌న్నాడు. ఆ వీడియో లీక్ అయ్యి … అప్పుడే రేవంత్ కుల‌గ‌జ్జి బ‌య‌ట ప‌డ్డ‌ది. ఆ త‌ర్వాత ఇప్పుడిలా. రెడ్లంటే త్యాగ‌మ‌న్నాడు. వాళ్ల‌కు ప‌దెక‌రాలుండాల‌న్నాడు. ఆ మ‌ధ్య మ‌న స్పీక‌ర్ పోచారం కూడా ఇలాగే కుల‌గ‌జ్జి చాటుకున్నాడు. రెడ్లు త‌మ పేర్ల వెనుక తోక‌లు క‌చ్చితంగా ఉంచుకోవాల‌ని, అవి వాళ్ల‌కు మ‌కుటాల‌ని ఏవేవో వాగేశాడు. స‌రే, తెలంగాణ కుల‌గ‌జ్జి బాగానే ఉంది. అదీ రెడ్ల‌కు.

ఆ టాపిక్ వ‌దిలేద్దాం. ఇప్పుడ స‌మ‌స్య‌ల్లా… రేవంత్ రెడ్ల రాగం అందుకోవ‌డం. ఓ పీసీసీ చీఫ్ అయి ఉండీ……. అలా కులం పాట పాడ‌టం .. ఏమ‌న్నా సోయి ఉండేనా మాట్లాడింది. ఇపుడిదే అనుకుంటున్నారంతా. బీసీ రాగం, ద‌ళిత రాగం కేవ‌లం అలా గొంతు నుంచి వ‌చ్చిన‌వే. రెడ్ల రాగం మాత్రం మ‌న‌సు లోలోతుల్లోంచి వ‌చ్చిన‌ద‌న్న‌ట్టు. రేవంత్ కు పీసీసీ ఇస్తే పార్టీలో దూకుడు పెరుగుతుంది…. జ‌నాల్లోకి పోతుంది.. ఏవో నాలుగు సీట్లు వ‌స్తాయి కావొచ్చ‌ని న‌మ్మింది అధిష్టానం. తొలత అంద‌రూ అలాగే అనుకున్నారు. టీఆరెస్‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్సే అనుకున్నారు. రేవంత్ దూకుడు టీఆరెస్‌కు అడ్డుక‌ట్ట వేస్తుంద‌నీ అనుకున్నారు. అలా ఒక‌డుగు ముందుకు ప‌డిందో లేదో…. ఇగో ఇలాంటి చ‌ర్య‌లు, మాట‌ల‌తో నాలుగ‌డుగులు వెన‌క్కి ప‌డేలా చేస్తాడు రేవంత్‌. అంతా స్వ‌యంకృతాప‌రాధం. వేదిక‌ల‌పై ఎడాపెడా కొడ‌తాడు. నోటికేదొస్తే అది మాట్లాడ‌తాడు. ఇక త‌న‌కు తిరుగులేద‌ని మితిమీరిన అహంకారం ప్ర‌ద‌ర్శిస్తాడు. ఇగో అప్ప‌డ‌ప్పుడు ఇలా కుల‌పిచ్చి, గ‌జ్జిని కూడా ప్ర‌ద‌ర్శిస్తాడు. అటు బీజేపీ రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం తండ్లాడుతుంది. ఇప్ప‌టికే చాలా చోట్ల అది కాంగ్రెస్‌ను కాద‌ని ముందుంది. ఇలాంటి చ‌ర్య‌ల‌తో కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డాల్సి వస్తుంది.

వాస్త‌వానికి రాహుల్ వ‌రంగ‌ల్ స‌భ స‌క్సెస‌య్యింది. రైతు డిక్ల‌రేష‌న్ ఓ చ‌ర్చ‌కు తెర‌లేపింది. టీఆరెస్‌ను గెలిపించేందుకు ఆ పార్టీ వాళ్లు క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇగో ఇలా రేవంత్‌లు… బండి సంజ‌య్‌లు త‌మ అవ‌గాహ‌న లేమి, మితి మీరిన అహంకారం, ఆత్మ‌విశ్వాసంతో టీఆరెస్ నెత్తిన పాలు పోస్తూ ఉంటారు. కేసీఆర్‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను క‌డిగేస్తూ ఉంటారు.

You missed