ఇది రామన్న సెటైరికల్ పంచ్‌లు. బండి సంజయ్ నిన్న మాట్లాడిన ప్లీజ్ .. ప్లీజ్ అంటూ అధికారం కోసం ప్రజలకు పెట్టుకున్న రిక్వెస్టు పై ఆయన తనదైన శైలిలో స్పందించాడు. ప్లీజ్.. ప్లీజ్…. అంటే అధికారం ఇస్తారావయా…ఇదేమన్నా తంబాకా..? లవంగమా…? ఏం జేసినవో చెప్పురా హౌలా అంటే అది చాతకాదు… అంటూ పంచ్ డైలాగులతో కడిగిపాడేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండి ప్లీజ్ ప్లీజ్ స్లోగన్ నవ్వులాటగా మారింది. హనుమంతుడిని చేయబోతే కోతైంది అన్నట్టుగా బండి సెంటిమెంట్ డైలాగు కాస్త ఇలా సెటైర్లు వేసుకునేందుకు పనికి వచ్చింది టీఆరెసోళ్లకు. టీడీపీకిచ్చారు అధికారం.. కాంగ్రెస్‌కిచ్చారు అధికారం… ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి అని ఆయన అన్న మాటలపై కూడా ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆరెస్సే అధికారంలో ఉంది. ఇక కాంగ్రెస్, టీడీపీలకు ఎప్పుడిచ్చారు అధికారం..? అనేది వారి వెటకారానికి కారణమైంది. ఆకాశం ఈనిందా..? అన్నట్టుగా జనం వచ్చారని బండి సంజయ్ తన స్పీచ్‌లో మొదటగా సంబోధించాడు. దీన్నీ వదల్లేదు. భూమి ఈనిందా అనేది కరెక్టు పదం. బండితో పాటు కిషన్ రెడ్డినీ వదల్లేదు… అమిత్ షా బదులు స్పీచ్‌లో చాలా సార్లు మోడీ పేరును ప్రస్తావించాడు. దాన్నీ బయటకు తీసి ఆడుకున్నారు.