కామారెడ్డి:
మహబూబ్ నగర్ లో గోడలకు సున్నాలు వేసినోడు, కరీం నగర్ లో చందాలు వసూలు చేసినోడు కేసీఆర్ లాంటి పెద్దమనిషిని విమర్శిస్తున్నార‌ని రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌ల‌నుద్దేశించి మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం అనంతరం భహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

80 ఏళ్ల క్రితం నిజాం పాలనలో కేసీఆర్ పూర్వీకుల భూమి కోల్పోతే 2 లక్షల 50 వేలు ప‌రిహారం కింద ఇచ్చార‌ని గుర్తు చేశారు. కేసీఆర్ పుట్టిన నాటికే 500 ఎకరాల భూస్వామి అన్నారు. రెండు ఎకరాల సువిశాల ఇంటిలో కేసీఆర్ పుట్టార‌ని, మహబూబ్ నగర్ లో గోడలకు సున్నాలు వేసినోడు, కరీం నగర్ లో చందాలు వ‌సూలు చేసినోడు కేసీఆర్ లాంటి పెద్దమనిషిని విమర్శించడ‌మా..? ఖ‌బ‌డ్డార్ అని హెచ్చ‌రించారు. మడమ తిప్పకుండా పోరాటం చేసి చావు నోట్లో తలపెట్టి , ప్ర‌జ‌ల‌ బ్రతుకులు పండగ చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

వయస్సుతో సంబంధం లేకుండా మైక్ దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతార‌న్నారు. కేసీఆర్ పుట్టిన నాడే వందల ఎకరాల్లో పుట్టాడ‌ని, రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టే.. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చార‌ని అన్నారు. 63 లక్షల రైతన్నలకు రైతు బంధు సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమ‌న్నారు. మన ఊరు మన బడి పథకం ద్వారా విద్యా యజ్ఞానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి కేసీఆర్ అని, కామారెడ్డిలో మంత్రిగా పనిచేసిన వారు కంత్రి పనులు చేశారు తప్ప మంచి పనులు చేయలేదన్నారు.