ప్రశాంత్ కిషోర్ లాంటి నీచుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. వాడు ముందే పసిగట్టాడు దేశవ్యాప్తంగా ఓటరు నాడిని.కాంగ్రెస్ మీద ప్రేమతో కంటే బీజేపీ ఏ టీం,బీ టీం ల దుర్మార్గపు పాలన పట్ల వ్యతిరేకతతో ఓటర్లు కాంగ్రెస్ వైపు ఈసారి కదం తొక్కబోతున్నారని.అందుకే అతను చాలా తెలివిగా కాంగ్రెస్ వైపు చేరి నేను చక్రం తిప్పుతాను నాకు స్టీరింగ్ ఇవ్వండి అని హడావుడి చేసాడు.కాంగ్రెస్ లో చక్రం తిప్పాలంటే ముందు క్లీనర్ గా చేరాలి వెళ్లవయ్యా….వెళ్లూ అంటూ గుమ్మం వేపుకు చూపించారు.దానితో ఇన్నాళ్లూ బీజేపీతో బీ టీంలుగా అంటకాగుతూ తనతో ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళను కాంగ్రెస్ జట్టుకట్టించి వారిని ఒడ్డు దాటించాలని ట్రై చేసాడు.ఈ సారి మనోడిని 10 జనపథ్ ఉన్న వీధి చివరిదాకా సాగనంపారు. వెల్లెళ్లవయ్యా..వెళ్లూ అని……నేనో పెద్ద తోపు తురుముఖాన్ ని అనుకుంటున్న అతగాడు ఇక చేసేది లేక పాదయాత్ర అంటూ ఓ సరి కొత్త ఊరేగింపుకు తెరతీశాడు. ఇతడి ఆలోచన బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చి బీజేపీని గెలిపించాలని.ఆల్రెడీ ఇప్పటికే ఆ పని మీదనే ఉన్న ఓవైసీ,మాయావతి లకు ఇతను కూడా జత కలుస్తాడన్నమాట.

ఇక నిన్న వరంగల్ మీటింగ్ కు వచ్చిన జనాన్ని చూస్తుంటే ఇట్టే తెలుస్తోంది ఈసారి కాంగ్రెస్ తన అస్తిత్వం ఉన్న చోట ఏమేరకు ప్రభావాన్ని చూపబోతోందోన్నది.స్వతంత్ర భారత దేశంలో పార్టీలు,నాయకులు తప్పులు చేశారు కానీ మన ఓటర్లు తప్పుడు తీర్పు ఏనాడూ ఇవ్వలేదు.ఓటర్ తలిస్తే ఇంట్లో పడుకుని ఉన్నవాడిని కూడా తీసుకొచ్చి అందలం ఎక్కించగలడు,ఎవరెష్టు శిఖరం మీద కూర్చున్న వాడినీ నేలకు కూల్చేయగలడు.అపుడు ఇక పొత్తులు,కెమిస్ట్రీలు, కులాలు,మతాలు వంటి కాకుల లెక్కలకు చోటు ఉండనే ఉండదు ప్రజాస్వామ్య భారత ఎన్నికల రణరంగంలో.

ఎటొచ్చీ రాహుల్ గాంధీ కాస్తంత అప్రమత్తంగా వుండాలి
తనను, పార్టీని మానసికంగా దెబ్బకొట్టడానికి ప్రయత్నించే దుష్టశక్తుల నుండి తనను,తన పార్టీని కాపాడుకోవడంతో బాటు తన తండ్రి రాజీవ్,నాయనమ్మ ఇందిరల హంతకుల కంటే కూడా నీచులైన ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల నుండి స్వతంత్ర భారతదేశపు ఔన్నత్యాన్ని కాపాడడానికి.

అల్ ద బెస్ట్ రాహుల్ గాంధీ.మా ఆంధ్ర రాష్ట్ర తలుపులు కూడా తెరిచే ఉంటాయి నీ కోసం…వరంగల్ రోడ్ల లాగా ఎప్పుడైనా…ఎక్కడైనా కూడా !!!

Raghu Sreemanthula

You missed