“నేను(నాగరాజు) ముస్లిం అయితా అన్నాడు. మా అమ్మ కాళ్ళు మొక్కాడు. తనవాళ్ళకి దూరంగా ఉంటా అన్నాడు”

___ అస్రీన్ సుల్తానా

ఇది కేవలం మతాలు వేరవ్వడం వల్ల జరిగిన హత్య కాదు. నాగరాజు దళితుడు అవ్వడం వల్ల జరిగిన కులహత్య కూడా. ఖురాన్ లో కులం లేదు కాబట్టి ముస్లిమ్స్ లో కేస్ట్ ఫీలింగ్ లేనట్టు కాదు. ఇండియాలో అన్ని మతాల్లో కులం అనే జబ్బు ఉంది. అప్పుడప్పుడు అది మనుషుల ప్రాణాల్ని బలితీసుకుంటుంది. వాస్తవాలను గుర్తెరిగినప్పుడు మాత్రమే మార్పు సాధ్యం అవుతుంది.

ఇంత బాధలో కూడా తను ఉరిశిక్ష వేయండి, చంపేయండి అనడం లేదు. తను(నాగరాజు) ప్రాణంతో ఉన్నపుడు మీరంతా ఎక్కడికి పోయారు? కాపాడటానికి ఎందుకు రాలేదు? అని అడుగుతోంది. ఆవేదనతో నిలదీస్తోంది. మనిషి పోయాక జరిగే న్యాయం కాదు కావాల్సింది, ముందు ముందు ఇటువంటివి జరగకుండా, ఎవరి మీదైనా దాడి జరుగుతుంటే, ఆ ఘోరాన్ని ఆపండని వేడుకుంటుంది.

Rambabu Thota

You missed