మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌……
ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?…

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ఎల్లారెడ్డి:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం లో ఆదివారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

లింగం పేట నుండి గాంధారి వరకు వయా నల్లమడుగు రోడ్ శంకుస్థాపన (6 కోట్ల 32 లక్షలు).22 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక ప్రారంభోత్సవము.
సొసైటీ కాంప్లెక్స్ భవన ప్రారంభోత్సవము.45 లక్షలతో నిర్మించిన నూతన గ్రంథాలయ బిల్డింగ్ ప్రారంభోత్సవము.మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా బాలికల ఉన్నత పాఠశాలలో 1 కోటి 89 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన,
55 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్,ఎంపి బి.బి పాటిల్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పలువురు లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే సురేందర్ నాయకత్వంలో అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని,నియోజకవర్గ అభిృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ప్రైవేటు కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని సౌక‌ర్యాలతో మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కేసిఆర్ మారుస్తున్నారనీ అన్నారు. నాణ్యమైన ఇంగ్లీషు మీడియం బోధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నారని చెప్పారు. గ్రంధాలయం ప్రారంభోత్సవం ద్వారా ప్రభుత్వ పోటిపరిక్షలకు సన్నద్ధం అయ్యే నిరోద్యుగులకు ఉపయోగపడుతుందని.విద్యార్థులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కొత్త పెన్షన్లు 57 సంవత్సరాలు నిండిన వారికి త్వరలో ఇస్తామన్నారు. సొంత జాగా ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

బిజెపి అధ్య‌క్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని మంత్రి ప్రశ్నించారు.

  • మోడీ 15 లక్షలు ప్రజల అకౌంట్లో వేసినందుకా..? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చినందుకా..?తెలంగాణ కు ఏమీ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నందుకా..? అని నిలదీశారు.కేంద్రం లోని బీజేపీ పెట్రోల్,డీజిల్ రేట్లు పెంచి పేద ప్రజల నిత్యావరాల ధరలు పెరిగేలా చేశారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు.. ఐఐఐటి లు 16 మంజూరు చేసినా తెలంగాణ కు ఒక్కటి ఇవ్వలేదన్నారు. నవోదయ పాఠశాలలు 84 ఇస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని,పైగా విభజన చట్టంలో పొందుపర్చిన ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నీ మోడీ లోకో ప్రాజెక్ట్ గుజరాత్ కు తీసుకువెళ్ళడన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనిర్సిటీ ఊసే లేదన్నారు. పసుపు బోర్డు మాటే లేదన్నారు.
    పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు కానీ కాళేశ్వరం,పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.మొన్నటికి మొన్న కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారనీ గుర్తు చేశారు. వీటన్నిటికీ బండి సంజయ్ సమాధానం చెప్పి పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
  • తెలంగాణ ప్రజల్ని నూకలు తినాలన్న కేంద్ర మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యలు సమర్ధిస్తూ చేస్తున్నావా అని ప్రశ్నించారు.నాడు వరి వేయమని చెప్పి బండి సంజయ్ తప్పించుకు తిరుగుతున్నాడనిఅన్నారు.నూకల నష్టం రైతుల మీద పడకుండా కేసిఆర్ భ‌రిస్తున్నాడ‌ని అన్నారు.
    తెలంగాణ కేంద్రానికి 3.65 లక్షల కోట్ల టాక్స్ చెల్లించిందని,తిరిగి తెలంగాణకు ఇచ్చింది కేవలం 1.68 లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారన్నారు.మిగతా డబ్బులు గుజరాత్,ఉత్తర ప్రదేశ్,మధ్యప్రదేశ్,బీహార్ రాష్ట్రాలకు తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది తప్పని నిరూపించితే మంత్రి పదవి కి రాజీనామా కు సిద్దమని సవాల్ విసిరారు.బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా అని డిమాండ్ చేశారు. బుడ్డర్ ఖాన్ రేవంత్ రెడ్డి వరంగల్ లో కాంగ్రెస్ రైతు సభ ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు..? కేసిఆర్ కంటే ముందు 10 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా…ఏం ఒరగబెట్టారని నిలదీశారు.బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పక్కనున్న మహారాష్ట్ర,కర్ణాటక ప్రజలు తెలంగాణలో కలపమని అడుగుతున్నారని గుర్తు చేశారు.దేశంలో అన్ని రంగాల్లో మొదటి స్థానంలో తెలంగాణ ఉన్నదన్నారు.కేంద్ర మంత్రులు పార్లమెంట్ వేదికగా చెప్తున్నారని అన్నారు.తెలంగాణలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు.కేంద్రంలోని బీజేపీ ఏం చేయదు… గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేయలేదని,మంచి చేస్తున్న కేసిఆర్ కు అడ్డం పడుతున్నారని దుయ్యట్టారు.ఎన్నటికైన తెలంగాణ కు కేసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమాల్లో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ దఫెదర్ శోబారాజు,జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ స్థానిక ప్రజాప్రతినిధులు,పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

You missed