నిన్ను, మీ డాడీని తెలంగాణలోని చాలా మంది జనాలు ఎందుకు మోస్తున్నారో తెలుసా?
బీజేపీ అనే పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావొద్దనే ఒకే ఒక కారణంతోనే.. ఆ ఒకే ఒక్క రీజన్‌తో టీఆర్ఎస్‌కు ఓట్లు వేసే వాళ్లు చానా మంది ఉన్నరు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ.. ఆ ఆర్ఎస్ఎస్ వలలో పడితే.. రావల్సిన నాలుగు న్యూట్రల్ ఓట్లు కూడా పోతయ్.
ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతుంది. దాన్ని అర్దం చేసుకొని ముందుకు పోవాలె గానీ.. నువ్వు కూడా చిల్లర భాష మాట్లాడితే ఎలా బ్రదర్.
కాంగ్రెస్ పార్టీ అయినా ప్రత్యామ్నాయంగా మారుతుందంటే.. అది పాతాళం ఇంకెంత లోతుందా అని సింగరేణి బాయి తవ్వినట్లు తవ్వుకుంటా పోతాంది.
తెలంగాణ తెచ్చినవో.. లేదో అనే ముచ్చట ఒడిశింది. ఇప్పుడు ఆ మతతత్వ పార్టీ నుంచి తెలంగాణను రక్షించమని చాలా మంది వేడుకుంటున్రు. ”చిల్లర భాష, బూతులు మాకు రావా ”అని మాట్లాడుకుంటా బద్నాం కాకు.
నీకు, నీ పార్టీకి మళ్లీ ఓటేయడానికి చాలా మంది రెడీగా ఉన్నరు. అది వాడుకో.. మళ్లీ అధికారంలోకి రా.. అంతే కానీ బురదలో దిగి పందితో ఫైటింగ్ చేయకు.
# John kora