జర్నలిస్ట్ బండి మీద ప్రెస్ ఉండొద్దట. ఊడవీకాలని నాల్రోజుల టైమిచ్చిండ్రు పోలీసులు. లేకుంటే 700 ఫైన్. కొందరికి ఏశిండ్రు గూడ. మీడియాలో పనిచేసే అందరు సుత ప్రెస్ అని రాపిచ్చు కుంటరు. రిపోర్టింగ్ కోసం ఆత్రమాత్రం పోతుంటే బండి మీద ప్రెస్ ఉంటే ఎవరూ ఆపరని భరోసా. ధర్నాలు, నిరసనల దగ్గరకు పోవాలంటే ప్రెస్ అనే అక్షరాలు సూశి ఇడిశేస్తరు. కనిప్పుడు ప్రెస్ అని రాస్కోవద్దట.

కోర్టు ఆర్డర్ను పాటిస్తుర్రంట. మరి ఏ కోర్ట్ చెప్పిందని వీఐపీలు వస్తుంటే వందల మందిని రోడ్ల మీద ఆపుతుండ్రు..? మన ఓట్ల తోటి గెల్శిన ఎమ్మెల్యే, ఎంపీల కార్లకు ఆ స్టిక్కర్లు దేనికి..? పోలీసు బండికి స్టిక్కర్ లేకుంటే ఏమైతది..? మేం రూల్స్ పాటిస్తం..మరి గుంతల రోడ్ల సంగతేంది..? అండ్లవడి కాల్రెక్కలు ఇరిగితే ఎవలు బాధ్యులు..? ట్రాఫిక్ జామైతే ఎవలు కారణం..?

పోలీసుల పని కరెక్టే అనిపిస్తుందేమో మన జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్ట్ నాయకులు ఎవ్వలు సప్పుడు జెస్తలేరు. ఇయ్యాల బండ్ల మీద ప్రెస్ ఉండొద్దు అన్నోళ్లు రేపు మెడల ఐడీ కార్డ్ ఉన్నా కవరేజ్ కి ఎంట్రీ లేదంటరేమో. మొన్న ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జర్నలిస్టుల హక్కుల గురించి, సౌకర్యాల గురించి మాట్లాడినోళ్లు ఇప్పుడు సైలెంట్ అయ్యిండ్రు. మీడియాలో పని చేయకున్నా ప్రెస్ అని రాయించుకుంటే ఫైన్ ఎయ్యాల్సిందే. కనీ సంస్థ ఐడీ కార్డ్, అక్రిడేషన్ ఉన్నా కూడా ఫైన్ వేయడం దారుణం. మనం అందరి గురించి మాట్లాడుతం. మన గురించి ఎవరూ మాట్లాడరు… మనమూ మాట్లాడం. అందరికీ అక్రిడేషన్లు, ఇండ్ల జాగలు వస్తయో రావో ఎన్కశిరి…కనీసం బండి మీద ప్రెస్ అన్నా కాపాడుకుందాం…✊

Raghu Bhuvanagiri

You missed