విలేకరులు కావలెను
——————

మా చానల్ నందు పనిచేయుటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రిపోర్టర్లు కావలెను
********
💥తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్స్ మరియు నియోజకవర్గాల వారిగా ఇంచార్జి లు “మండలాల వారీగా రిపోర్టర్లు కావలెను”

💥మా సంస్థ నుండి ఐడి కార్డ్,లోగో మరియు జాయినింగ్ అపాయిట్ మెంట్ లెటర్ ఛానల్ కు సంబంధించిన ట్యాగ్,స్టిక్కర్స్ ఇవ్వబడును..
💥అసక్తి కలిగిన అభ్యర్థులు మీ యొక్క బయోడేటాను కింది వాట్సప్ నెంబర్ కి మీ ఆధార్ కార్డు , మరియు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తోపూర్తి వివరాలుపంపగలరు..

💥 ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్లకు కు సంప్రదించి మీ యొక్క పూర్తి వివరాలు పంపగలరు..

………………………………………………………………………………………………………………………………………………………….

ఉద్యోగాల్లేవ్‌… నోటిఫికేష‌న్లు లేవు… నిరుద్యోగం పెరిగిపోతున్న‌ది…. అని మొత్తుకుంటున్నారు గానీ… ఎవ‌రూ ఈ అవ‌కాశాన్ని గ‌మ‌నించ‌డం లేదు.

అదే విలేక‌రి జాబ్‌…

రోజుకో వాట్సాప్ గ్రూపుల పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛాన‌ళ్లు, వెబ్ సైట్లు, ఈ పేప‌ర్లు….. కొంగొత్త అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్న‌ది. కానీ ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

మీడియా అంటే ఒక‌ప్పుడు ఎంత‌టి క్రేజ్‌.. ఇప్ప‌డ‌ది త‌గ్గిపోయిందా..? ఎవ‌రూ దొర‌క‌డం లేదా..? ఉన్న‌వాళ్లు ఏదో ఒక‌దాంట్లో సెటిల్ అయిపోయిండ్రా..? మ‌న‌కెందుకీ ప‌నికిమాలిన జాబ్ అని ఈస‌డించుకుంటున్నారా..??

కావాలి.. కావాలి… రావాలి… రావాలి.. అంటూ పిలిచి మ‌రీ ఉద్యోగం ఇస్తామంటే ఎందుకీ ఉదాసీన‌త‌..?

ఐడీ కార్డిస్తారంట‌.. ఎంచ‌క్కా..దాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చు.. ఎవ‌రూ అడిగేవారుండ‌రు… అయినా ఎందుకు స్పందించ‌డం లేదు…

జీత‌మా..? ఎవ‌డికావాలి జీతం.. ?? వాళ్లిస్తే ఎంత ఇయ్య‌క‌పోతే ఎంత‌…? ఓ ఐడీ కార్డు ప‌డేస్తే చాలు … అది చూపిస్తే చాలు ఎలాంటి ప‌నులైనా జ‌రిగిపోత‌య్‌..? ఎంత‌టి వారైనా స‌లాం కొడ‌తారు..? మ‌రెందుకు ఎవ‌రూ రావ‌డం లేదు..

సొసైటీలో ఎంత‌టి మ‌ర్యాద‌… ఎంత‌టి హుందాత‌నం.. విలేక‌రి గిరీ అంటే. ఇంట్లో తినేందుకు ఆ పూట లేకున్నా బ‌య‌ట ఎమ్మెల్యే ద‌గ్గ‌ర‌, అధికారుల ద‌గ్గ‌ర ఎంత‌టి ప్ర‌తిష్ఠ‌… ప‌రువు.. గౌర‌వం….

మ‌రెందుక‌నో దీనికి ఈ మ‌ధ్య అంత గిరాకీ లేదు.

క‌నీసం ప‌ది చ‌దివినా చాలు.. అదీ లేకున్నా ప‌ర్వాలేదు.. ఉద్యోగాలిచ్చేస్తారు……? మ‌రెందుకు రావ‌డం లేదో అర్థం కాదు..

అస్త‌మానూ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ… ఉద్యోగాలిస్త‌లేద‌ని తిట్టుకుంటూ.. ఉండేబ‌దులు.. ఇలాంటి మ‌హ‌త్త‌ర‌మైన అవ‌కాశాలు వినియోగించుకుని…. ఎటూగానీ జీవితాల‌ను.. ఏదో ఒక విషాద‌తీరానికి చేరిస్తే కాదా..?

ఆలోచించాల్సిన విష‌య‌మే…

You missed