మ‌ల‌యాళ సినిమా క‌థ‌ను ఎత్తుకొచ్చి… అది ముందే పాత చింత‌కాయ ప‌చ్చ‌డి.. దాన్ని కిచిడీలాగా త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మ‌లుచుకుని … అతుకుల బొంత చేసి.. ధిమాక్ ఖ‌రాబ్ సినిమా కింద దీనికి భీమ్లా నాయ‌క్ అని పేరు పెట్టి ఇలా ఈ రోజు ప్రేక్ష‌కుల మీద‌కు వ‌దిలారు.

అస‌లు అది సినిమానే. స్టార్టింగే మ‌య బోరింగ్‌గా క‌థ‌నం. మ‌ల‌యాళ క‌థ‌ను య‌థావిధిగా అక్క‌డ‌క్క‌డా వాడుకుందామ‌నుకున్నాడేమో.. అక్క‌డే బోరింగ్ సీన్లు వ‌చ్చాయి. ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు మ‌లుచుకున్న సీన్ల‌న్నీ సేమ్ గ‌తంలో వ‌చ్చినవే. ఎబ్బెట్టుగా.. ఓవ‌ర్ హీరోయిజం…. అస‌హ‌జ‌మైన ఫైట్లు….

రానాను స‌రిగా వాడుకోలేదు. మంచి యాక్ట‌ర్‌. క‌థ‌లో మొద‌ట ఎలా చూపించారో అదే టెంపో ఆ పాత్ర‌కు లేదు. హీరో కోసం ఆ పాత్ర‌ను ఖూనీ చేసి పాడేశారు. పాపం.. రానా బ‌క్రా అయిపోయాడు ఇందులో. ప‌వ‌న్ అతి హీరోయిజంకు రానా బ‌లైపోయాడు. ప‌వ‌న్ వీర అభిమానులు కూడా చిరాకుప‌డి, బోరింగ్‌గా ఫీల‌య్యే సినిమా ఇది. మొద‌టి నుంచి లాస్ట్ వ‌ర‌కు ధిమాక్ ఖ‌రాబ్ మూవీ. ఇంత ఘోర‌మైన , బోరైన‌, బోరున విసిగెత్తించే సినిమా ఈ మ‌ధ్య‌కాలంలో రాలేదేమో.

ఇద్ద‌రు హీరోలు. ప‌వ‌న్‌, రానా. ఇద్ద‌రి మ‌ధ్య ఇగోలు. మంచి క‌థే. కానీ దాన్ని అదే ప‌ద‌నుతో తీసుకుపోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే కూడా సో సో. అవి కూడా కాపాడ‌లేక‌పోయాయి. రానా పాత్ర ను క్లైమాక్స్ కు ముందు రియ‌లైజ్ అయిన‌ట్టు.. హీరో గురించి తెలుసుకుని మారిపోయిన‌ట్టు చూపించారు. చివ‌ర‌కు భీక‌ర పోరు ఈ ఇద్ద‌రి మ‌ధ్యే పెట్టారు. బ‌ల‌హీన‌మైన క‌థ‌నం, అస్స‌లు కుద‌ర‌లేదు. ఎక్క‌డా ఆక‌ట్టుకోలేదు. ఒక కామెడీ లేదు. పాట‌లు పంటికింద రాయిలాగే వ‌చ్చిప‌డ్డాయి. కొత్త సినిమాలో పాట‌లు వ‌స్తుంటే మ‌ధ్య‌లో ప్రేక్ష‌కులు లేచి వెళ్లిపోవ‌డం అంటేనే తెలుస్తుంది.. సినిమా, పాట‌ల స్టామినా ఏమిటో..?

ప‌వ‌న్ ప‌ని అయిపోయింది. ఇదే త‌ర‌హాలో .. రొడ్డ కొట్టుడు సినిమాలు తీస్తే ఇక జ‌నం చూడ‌రు. ప్ర‌యోగాల జోలికి మ‌నోళ్లు పోరు. ఇదే పెద్ద ప్ర‌యోగం ప‌వ‌న్ సినిమాల్లో. రానాకు అంతో ఇంతో ప్ర‌యార్టీ ఇచ్చిన‌ట్టు ఇచ్చి చివ‌ర‌కు అత‌న్ని చిత‌క్కొట్టి ప‌వ‌న్‌ను లేపే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ప‌వ‌న్ లేవ‌లేదు. సినిమా నేల క‌రిచింది. రానా బ‌క్రా అయ్యాడు.

కొత్త డైరెక్ట‌ర్ ప్ర‌భావ‌మేమీ ఇందులో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ప‌వ‌న్ కూడా డైరెక్ష‌న్‌లో వేలు, కాళ్లు పెట్టిన‌ట్టున్నాడు. క‌ర్ర‌ల‌తో విల‌న్ల‌ను చిత‌క‌బాదుడు, పిస్ట‌ళ్ల‌తో కాల్చుడు.. ఇవ‌న్నీ అత‌ని స్టైల్ డైరెక్ష‌నే. రోటిన్ రొడ్డ‌కొట్టుడు సీన్ల‌న్న‌మాట‌. ఫైటింగ్ సీన్ల‌లో కుక్క క‌రిచిన‌ట్టు అరుచుకునుడు కూడా ప‌వ‌న్ మార్క్ డైరెక్ష‌నే. నా కొడ‌కా.. నా కొడ‌కా…. ఇలా అంటేనే గానీ హీరో ఆవేశం ఎలివేట్ కాదేమో.. ఎన్ని సార్లు అనిపించారో హీరోతో ఈ డైలాగు.

క్లైమాక్సులో హీరో పడిపోతాడు. చ‌చ్చిన‌ట్టే అనుకుంటారు.గుడి పైన కుండ‌ను ప‌గుల‌గొట్టి క‌ళ్లు తాపితే లేచి ఇక వీర బాదుడు బాదుతాడు.. ఓర్నీ… ఏ కాలం నాటి బుర్ర రా బాబు మీది.. ఇంకా ఇలాంటి సీన్లు కూడా వాడుతున్నారా సినిమాల‌కు…

You missed