మంచు ఫ్యామిలీ గతంలో ఎన్నడూ లేనంతగా ట్రోల్ అయ్యింది వాస్తవమే. మంచు మోహన్‌బాబు ఓవర్ యాక్షన్ మాటలు నవ్వుల పాలయ్యాయి.. వాస్తవమే. సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా తీశారు… కానీ అది ఎవరికీ నచ్చలే..ఎవరూ అటు వైపు వెళ్లలే.. వాస్తవమే.
కానీ,
మోహన్‌బాబు అండ్ ఫ్యామిలీ పై యూట్యూబర్స్ చేసిన ట్రోలింగులతోనే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందనడం అవాస్తవం..
ముఖం బాగాలేక అద్దం పగులగొట్టుకున్నట్టు…
విషయం ఉంటే ఎంత దుష్ప్రచారం చేసినా.. వివాదాలు మెడకు చుట్టినా చూసేవాళ్లు చూడకమానరు. అర్జున్ రెడ్డి సినిమా విషయంలో పెద్ద దుమారయే రేగింది. ఆ నెగెటివ్ ప్రచారమే ఆ సినిమాకు ప్లస్ అయ్యింది.
మరి సన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఆడలేదో .. లోపాలేమిటో తెలుసుకోకుండా….. మా ప్రొడక్ట్ అంతా ఓకే… మీరే పక్కదారి పట్టించారని సోషల్ మీడియాపై దుమ్మెత్తిపోయడమెందుకు..??
మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ అవుట్ డేటెడ్ హీరోలు. ఇప్పుడు వీరిద్దరూ ఏ సినిమా తీసినా… ఎంత బడ్జెట్ పెట్టి.. ఎంత కొత్త కథలు తీసినా.. ప్రేక్షకులకు అంత ఈజీగా అవి చేరవు… ఇది వాస్తవం.
కానీ, కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు.. మోహన్‌బాబు మాత్రం తన సంతానంపై ప్రేమను తగ్గించుకోలేదు. పుత్ర వాత్సల్యం.. ఓకే. కానీ జనం నాడి.. ప్రేక్షకుల అభిరుచి ఏమిటో తెలుసుకోకుండా.. సినిమాలు తీస్తూ జనాలపైకి వదిలి… అది ఆడలేదు కాబట్టి.. దీని వెనుక ఎవరున్నారని… రంధ్రాన్వేషణ చేయడం.. ఇప్పుడంతా జరిగేది జరుగుతున్నది ఇదే.
అప్పుడెప్పుడో మంచు విష్ణు సినిమా ఢీ హిట్టయ్యింది. శ్రీ హరి , కామెడియన్లు బ్రహ్మనందం, సునీల్ ల నటన తోడవ్వడంతో. ఆ తర్వాత పెద్దగా చెప్పుకోనేవి ఏమీ లేవు.
హీరోలు తమ పిల్లలను కచ్చితంగా హీరోలుగా చేయాలని పట్టుబట్టి ఇలా జనాలకు మీదకు సినామాల రూపంలో వదులుతూనే ఉంటారు. వరుస ఫ్లాపులు వచ్చినా సరే. వారు మారరు. ఇలా మందిని తిడుతూ కూర్చుంటారు.
ఈ కోవలో…
చిరంజీవి, నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, నిర్మాత బెల్లంకొండ సురేశ్…….
ఇదింకా ఇంది. పెరుగుతూనే ఉంటుంది.