కొంద‌రంతే. కొంద‌రి జీవితాలూ ఇంతే. పార్టీలో క‌ష్ట‌ప‌డితే ఏదో అయిపోతామ‌నుకుంటారు. ఏవో ప‌ద‌వులిచ్చి వెల‌గ‌బెడ‌తార‌ని ఆశ‌ప‌డ‌తారు.క‌ష్టాల‌న్నీ తీరుతాయ‌నుకుంటారు. శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపూ వ‌స్తుంద‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటూ ఉంటారు. ఏ పిలుపిచ్చినా ముందుంటారు. జెండాలు మోస్తారు. మీడియాలో ఫోట్వ‌లు చూసి మురిసి మురిసి పోత‌రు. వాటిని అంద‌రికి పంపుకుంట‌రు. పెద్దలు త‌మ క‌ష్టాన్ని చూసి మెచ్చుకుని మెడ‌లేస‌కుంట‌ర‌ని తెగ ఆశ‌ప‌డి ఆరాట‌ప‌డుతూ ఉంట‌రు. కానీ ఏళ్లు గ‌డిచినా.. కంటి చూపు మంద‌గించి క‌ళ్ల‌ద్దాలు వ‌చ్చినా.. ఉద్య‌మాలు చేస్తూనే ఉంటారు. ప‌ద‌వులుండ‌వు. ప‌ల‌క‌రిచ్చే వాళ్లూ ఉండ‌రు. కానీ, ఇంకా ఆశ చావ‌దు. చ‌చ్చినా చావ‌దు. చ‌చ్చేలోపైనా ఏదైనా ఇవ్వ‌క‌పోతారా అనే అత్యాశా చావ‌దు.

You missed