అభిమానం అంటే అంతే. మతం ఓ పచ్చి. మత చాదస్తం తలకెక్కితే … ఇగో ఇలాగే ఉంటుంది. తన అభిమాన లీడర్ అసదుద్దీన్ ఆరోగ్యంగా ఉండాలని ఓ పిచ్చి, వెర్రి, మూర్ఖ, చాదస్త అభిమాని ఏకంగా 101 మేకలు బలి ఇచ్చాడట. ఎవరైనా 101 కొబ్బరి కాయల మొక్కు తీర్చుకున్నట్టు విన్నాం ఇన్ని రోజులు.. ఇతగాడి చాదస్తపు రేంజ్ శృతి మించి పోయి ఉన్నట్టుంది. తన అభిమానాన్ని ఇలా వైరల్ చేసుకున్నాడు 101 మేకలను బలి ఇచ్చి. ఈ మధ్య ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్బంగా ఎవడో కాల్పులు జరిపాడు. ఇది ఎన్నికల డ్రామాగా అనుకున్నారంతా. ఇదే కారణమై ఉంటుంది…. ఈ వీరాభిమాని మేకలను బలి ఇచ్చేందుకు. మీలాంటి వారుంటేనే కదా.. ఇలా మత పార్టీలు, కుల పార్టీలు, కుతంత్ర పార్టీలు, కుళ్లిన పార్టీలు పదికాలాల పాటు బతికి బట్టకట్టేది.