ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మీరట్ లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ) పై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులు దేనికి సంకేతం..? అసలు ఇవి నిజంగా జరిగిన కాల్పులేనా..? అనే అనుమానాలూ లేకపోలేదు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అంతటా ఇదే చర్చ జరుగుతోంది. దీన్నొక రాజకీయ డ్రామాగా కూడా కొట్టి పారేస్తున్నారు. అనుమానిస్తున్నారు.
ముస్లిం ఓట్లు గంప గుత్తగా తమకే పడితే ఎన్నో కొన్ని సీట్లు సాధించొచ్చనే భావనలో ఓవైసీ ఉన్నాడు. ముస్లిం ఓట్లు ఓవైసీకి కాకుండా ఎస్పీకి పడితే ఓట్లు చీలి తమకు నష్టం వాటిల్లుతుందని బీజేపీ భావిస్తున్నది. ఈ క్రమంలోనే జరిగిన ఈ కాల్పల వెనుక ఎవరున్నారు..? ఎవరికి లాభం..? ఎవరున్నారనే సంగతి అటుంచితే.. లాభం మాత్రం ఎంఐఎం, బీజేపీలకే. గంప గుత్తగా ముస్లింల ఓట్లు ఎంఐఎంకు పడేందుకు ఈ ఘటన దోహదం చేయనుంది.
ముస్లిం ఓట్లు చీలకపోవడంతో ప్రతిపక్షానికి ముస్లిం ఓట్లు పడకుండా చేయడంలో బీజేపీకి ఇది అనుకూల అంశంగా మారనుంది. దీంతో ఇటు ఎంఐఎం ఎన్నో కొన్ని సీట్లు దక్కించుకుంటుంది. బీజేపీ ప్రతిపక్షానికి అవకాశం లేకుండా తనే అధికారం చేపట్టేందుకు లైన్ క్లియర్ అవుతుంది.