ఎవరు ఎవరికి చెప్పలేదు. ఊళ్ళల్లో చాటింపు వేయలేదు. ప్రచారం చేయనూ లేదు. కానీ ఇసుకేస్తే రాలనంత జనం పొగయ్యారు. డప్పుల మోతల మధ్య ప్రేక్షకుల ఈలలు, కేకలు, పైల్వన్ అగాయా అంటూ కామెట్రితో మైదానం అంతా మారుమోగింది.

హిందీ సినిమా ‘దంగల్’ తలపించింది పెద్ద ఎడిగి కుస్తీ పోటీలు.

అనాదిగా ఏయే జాతరలు, ఎక్కడెక్కడ, ఎపుడూ నిర్వహిస్తారో… జాతర ప్రత్యేకం ఏంటో ఇక్కడి, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత వాసులకు ఎరుకే.

కుస్తీ పోటీలు ఉన్నాయంటే చాలు… జబ్బ కల్గిన మల్లయోధులు వస్తారు. చూసేందుకు జనం ప్రవాహంలా దూసుకొస్తారు. అక్కడ సందడి ఆనందం మాటల్లో చెప్పలేనిది.

ఏటా కుస్తీ పోటీలు నిర్వహిస్తూ ప్రాంత ప్రజలను ఖుషి చేస్తూ… ఆనాటి ఆచార సంప్రదాయాలను పరిరక్షణకు పాటు పడుతున్న పెద్ద ఎడిగి పెద్దలకు, ప్రజలకు ధన్యవాదాలు

ఏక్ నాథ్, జుక్కల్

You missed