కోవిద్ కట్టడికి లాక్ డౌన్ మార్గమా ?

ఆస్ట్రేలియా ప్రపంచం లో కెల్లా అతి పొడవైన లాక్ డౌన్ విధించింది . వారి మెల్బోర్న్ నగరం లో ఏకంగా 262 రోజుల లాక్ డౌన్ కొనసాగింది . కొన్ని నగరాల్లో దీని నిడివి కాస్త తక్కువ . కానీఈ ప్రపంచం లో కెల్లా అతి పొడవైన అతి ఖచ్చితమైన లాక్ డౌన్ పాటించింది ఆస్ట్రేలియా .

. ఆస్ట్రేలియా లో మొన్న కేసుల సంఖ్య 4000 . నిన్న 5000 . ఈ రోజు 8000 .

ఇక పై లాక్ డౌన్ విధించబోమని వారి ప్రభుత్వం ప్రకటించింది .

ఇండియా లో ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ కోరుకుంటున్నారా ?

లాక్ డౌన్ ఒకటే ప్రాణాలు కాపాడుతుందని అదేపని గా హోరెత్తిస్తే అమాయక ప్రజలు నిజం అనుకొంటారు . అదే జరిగింది . మళ్ళీ జరిగినా ఆశ్చర్యం అక్కర లేదు .

ఇంకో సారి లాక్ డౌన్ పెడితే ?

సామాన్య ప్రజలు సర్వ నాశనం అయిపోతారు . చిన్నా చితకా వ్యాపారాలు ఎత్తి పోతాయి . ధరలు చుక్కల్ని అంటుతాయి . బతకడం దుర్భరం అయిపోతుంది . పెద్ద వ్యాపారస్తుల , ఆన్లైన్ కంపెనీ లు . బహుళ జాతి కంపెనీ ల పట్టు మరింత బిగుస్తుంది . ఒక్కమాట లో చెప్పాలంటే కరోనా తో చచ్చినా పొయ్యివుండేది .. ఎందుకు బతికామురా దేవుడా అని జన సామాన్యం బాధ పడే రోజులు వస్తాయి .

నిజం నిష్టురంగా ఉంటుంది .

ఇంగ్లాండ్ లో ఈ రోజు లక్ష ఇరవై వేల కేసులు . అయినా అక్కడ ఇంకా లాక్ డౌన్ లేదు .

మరి ఇండియా లో ?

సమంత కు జలుబు పట్టిందా ? హాస్య కార్యక్రమ యాంకర్ పొట్టి డ్రెస్ లు వేసుకొందా ? మా ఎన్నికల్లో లేటెస్ట్ ఏంటి ? .. ఇలాంటి అతిముఖ్యమైన విషయాల పై మన వారి దృష్టి నిమగ్నం అయివుంది . కరోనా సోకినా తిరిగి వాక్సిన్ వేసుకోవాలా ? పూణే వాక్సిన్ కంపెనీ వాడు తన వెబ్ సైట్ లోనే వాక్సిన్ వేసుకొన్న కొంతమంది కి గుండెపోటు రావొచ్చు అని ఎందుకు పెట్టాడు ? అసలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినోయోగించాలి అని అనుమతి మాత్రమే పొందిన వాక్సిన్ ను రేపు పిలల్లకు వేయించడం అవసరమా ? విమానాల్లో రోజుకు వేల మంది ఓమిక్రాన్ సోకిన వారిని దించుతూ , ఇక్కడ కట్టడి పేరుతొ దేశాన్ని నెమ్మదిగా లాక్ డౌన్ వైపు నడిపించడం ఏమి న్యాయం .. ఇలాంటి ప్రశ్నలు అడిగే సమయం , అవసరం మనవారికి లేదు .

Amarnath Vasireddy

You missed