బిగ్ బాస్ షో… చిన్న పిల్ల‌లు దూరంగా ఉండాల్సిన రియాలిటీ టెలివిజ‌న్ గేమ్ షో. ఓ బూతు షో. ప‌రిప‌క్వ‌త లోపంచిన వ్య‌క్తిత్వాల‌న్నీ ఓ చోట నింపి .. ఒకర్నొక‌రు తిట్టుకుని, త‌న్నుకుని, కౌగిలించుకుని, ప్రేమించుకుని, కామించుకుని….. ఇలా ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగితే అంత ర‌క్తిక‌ట్టినట్టు ఆ ఆట‌. అందులో మ‌జా వెతుక్కునే వారూ లేక‌పోలేదు. ఆ బూతుల కోసం, ఈ స్కిన్ షోల కోసం ఆత్ర‌ప‌డి.. ప‌రిత‌పించే మాన‌వ‌పుంగ‌వులూ లేక‌పోలేదు.కానీ మన సంత‌న్న ఈ రోజు ఈ గేమ్ షోకు పోతున్నాన‌ని, త‌నే స్వ‌యంగా త‌న ఫేస్‌బుక్ వాల్‌పై పోస్టు చేసుకున్నారు.

ఔనా…నిజామా..? అని త‌ర‌చి త‌రిచి ఓ రెండు సార్లు చూసిన త‌ర్వాత క‌న్ఫాం చేసుకున్న త‌ర్వాత ముక్కున వేలేసుకోవ‌డం నా వంతైంది. నాగార్జున ఏదో మొహ‌మాట పెట్టేసుంటాడు.. అయినంత మాత్రాన అడ‌గ్గానే వెళ్లాలా..? ఓహో తమ‌రు అడ‌గ్గానే వ‌చ్చి ఓ మొక్క‌నాటి మ‌న‌కు మంచి ప్ర‌చారం చేసినందుకా..? మ‌న‌ని ఆ సినిమా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసినందుకా..? అయినా వారొచ్చేది..ముందు ముందు నీతో ప్ర‌భుత్వంతో అయ్యే ప‌నులు చేపించుకునేందుకు.

సీఎంతో కావాల్సిన ప‌నుల‌కు రాయ‌బారం పంపేందుకు. వారి స్వార్థం వారిది. కానీ నువ్వు మాత్రం ఈ షోకు వెళ్ల‌డం ఏమాత్రం బాగాలేదే సంతన్న‌. లోప‌లికి పోయి ఓ మొక్క నాటించేస్తే పోలా..? అని మీర‌నుకుని పోతున్నారేమో కానీ, బ‌ద్నాం కావ‌డం ఖాయం. నాగార్జున నిండా మునిగాడు. ఆయ‌న‌కు ఆదాయం మార్గం అది. మ‌న‌క‌వ‌స‌ర‌మంటావా సంత‌న్న‌. బ‌య‌ట‌కు వ‌చ్చినంక మీరొక పిలుపిస్తే వాళ్లంతా వ‌చ్చి ఓ మొక్క నాటి పోతారు క‌దా..? ఇంతోటి దానికి ఆ రొచ్చు హౌజ్‌లోకి కాలు పెట్ట‌డ‌మెందుకే…? అహ‌.. అర్థం కాక అడుగుతా.

అస‌లు అందులో ఉన్న‌వాళ్ల‌కు ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ గురించి తెలుసా..?

నీ గురించి తెలుసా..?

హ‌రిత‌హారం ప‌థ‌కం గురించి తెలుసా..?

మీరు ఎంపీ అన్న విష‌యం తెలుసా…?

అన్నింటికీ వారివ‌ద్ద నో అనే ఆన్స‌రే వ‌స్తుంది. నీ మీదొట్టు….

You missed