అది కర్నూల్ జిల్లా కడుబూరు పోలీస్ స్టేషన్. పొద్దు పొద్దున్నే ఇద్దరు ముగ్గురు స్కూల్ పోరగాండ్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నేరుగా ఎస్సై దగ్గరకే పోయారు. అందులో ఒక బడుతడు నాలుగు ఫీట్లు కూడా సరిగా లేడు. వాడు లొడ లొడా ఏదో చెబుతున్నాడు. మొదట ఎస్సైకు ఏమీ అర్థం కాలే. తర్వాత విషయం కొద్దిగా అర్థమయ్యే సరికి మనసులో నవ్వుకున్నాడు. జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు. అసలు విషయం ఆరా తీస్తూ వీడియో రికార్డింగ్ చేశాడు. అసలు సంగతేందంటే.. తన తోటి సోపతి గాడు.. రోజూ తన పెన్సిల్‌ను దొంగతనం చేస్తున్నాడని, వాడిపై కేసు పెట్టాలని వాడి డిమాండ్. వద్దు రా ఈసారి వదిలెయ్ అని ఎస్సై అన్నా.. వాడు వినలేదు. కేసు పెట్టిర్రి సార్ బుద్దొస్తది. వాళ్ల తల్లిదండ్రులకు నేను చెప్తా అని గట్టి పట్టు మీదున్నట్టే మాట్లాడిండు. ఆ బుడతడు మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఆ వీడియో ఇగో ఇది..
https://m.facebook.com/story.php?story_fbid=4384144955027396&id=100002958056192