చంద్రబాబును రాజకీయంగా సమాధి చేసేందుకు ఏపీ సీఎం జగన్ ఏమేమీ అన్నీ చేస్తున్నాడు. ఆఖరికి దిగజారిపోయి.. తన మంత్రులు, ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా దూషించేస్థాయికి కూడా పడిపోయాడు. ఫ్యాక్షన్ రాజకీయాలంటే కొత్త భాష్యం చెబుతున్నాడు. అక్కడి ప్రజలు ఛీదరించుకునేలా అధికార వైసీపీ వ్యవహిస్తున్నది. అసెంబ్లీలో చంద్రబాబును టార్గెట్ చేసి అతను కొడుకు లోకేశ్ ఎవరికి పుట్టాడో ముందు తెలుసుకోవాలంటూ కొడాలి నాని, ఇంకొకరు మాట్లాడిన వీడీయోను కొందరు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ మాటలు వాస్తవంగా చాలా మందికి చేరలేదు. చంద్రబాబు లేనిదాన్ని సృష్టించుకుని అలా ఏడుపు డ్రామా ఆడాడని విమర్శలు వచ్చాయి. కానీ అసెంబ్లీలోనే కాదు.. ఒక వైసీపీ లీడర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి మాటలే అన్నాడు. చంద్రబాబును మానసికంగా దెబ్బ తీసేందుకు ఇలాంటి మాటలను వాడుకోవాలని బహుశా ఆ టీం డిసైడ్ అయ్యింది కావొచ్చు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే కూడా జగన్ ఏమీ అనకపోవడం.. దీన్ని అడ్డుకోవడం కూడా కావాలని చేసిందే. జగన్కు కావాల్సింది బాబును మూడు చెరువలు నీళ్లు తాగించి ప్రతీకారం తీర్చుకోవాలి. రామోజీని అడ్డం పెట్టుకుని తనను, తన కుటుంబాన్ని వేధించిన తీరును మరిచిపోలేదు. పగబట్టాడు. ఇది రాజకీయంగానే కాదు… వ్యక్తిగతం దాకా వెళ్లింది. అందుకే బాబు సతీమణిని తిట్టినా కూడా జగన్ ఏమీ అనలేదు. అనండి అనే విధంగా ప్రోత్సహించాడు.
ఇదిప్పుడు జగన్ కే మచ్చ తెచ్చిపెట్టింది. బాబుకు సానుభూతి మద్దతు దొరుకుతున్నది. నందమూరి ఫ్యామిలీ నుంచి సపోర్టు వచ్చింది. వ్యక్తిగతంగా తనపై దాడి చేసిన జగన్పై రాజకీయంగా కసి తీర్చుకునేందుకు బాబు ప్లాట్ఫాం రెడీ చేసుకుంటున్నాడు. అసెంబ్లీలో జరిగిన ఈ ఉదంతం, బాబు విలపిచడం.. అక్కడి భ్రష్టు పట్టిన రాజకీయాలకు, దిగజారిన విలువలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు, పగ, ప్రతీకారాల సందర్భాలకు అద్దం పడుతున్నది.