ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ విడిపోయి మంచిప‌నైంది. ఆ చ‌చ్చు, పుచ్చు రాజ‌కీయాలు దూర‌మ‌య్యాయి. ఇక్క‌డా త‌యార‌వ‌తున్నాయి.. మెల్ల మెల్ల‌గా. త‌క్కువేం లేవు. కానీ మ‌రీ ఆంధ్ర రాజ‌కీయాలు రోజు రోజుకూ దిగ‌జారి పోయి.. ఇలా ర‌చ్చ‌కెక్కి దేశ‌వ్యాప్తంగా చర్చ‌లోకి వ‌స్తున్నాయి. మొన్న‌టికి మొన్న ఏపీ సీఎం జ‌గ‌న్‌.. న‌న్ను బోసిడీకే అన్నారు.. దీని అర్థం లంజా కొడుకా అని. మ‌రి సీఎంను ఇలా లంజా కొడుకా అని తిడ‌తారా.. అని దీర్ఘాలు తీసి.. ఒక్కొక్క అక్ష‌రం వ‌త్తి ప‌లికి మ‌రీ చెప్పుకుని గ‌ర్వ‌ప‌డి, సిగ్గుప‌డి, బాధ‌ప‌డి.. ఏదేదో అయి మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఉద్దేశ్యం న‌న్ను ఇంత ఘోరంగా టీడీపీ తిట్టింది చూశారా..? ప్ర‌జ‌ల్లారా..? వీళ్ల‌ను మీరు క్షమిస్తారా? ఇలాంటి నాయ‌కులు మీకు అవ‌స‌ర‌మా..? మేం కావాలా..? వాళ్లు కావాలా..? తేల్చుకోండి. ఎవ‌రి ప‌క్షం ఉంటారో డిసైడ్ అవ్వండి.. అని అడుక్కున్న‌ట్టుంది. అంత‌గా దిగ‌జారి మ‌రీ చెప్పుకున్నాడు జ‌గ‌న్.

సేమ్ ఈ రోజు అలాగే. అంత‌క‌న్నా ఘోరంగా. మాజీ సీఎం చంద్ర‌బాబు. త‌న భార్య‌ను ఏదో అన్నార‌ని, వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రెస్‌మీట్‌లో. మ‌ళ్లీ త‌న రోగం మాత్రం వ‌ద‌ల్లేదు. త‌న అపార అనుభ‌వాన్ని, పెద్ద‌ల‌తో ప‌రిచ‌యాల‌ను, ఎవ‌రెట్లా మెచ్చుకున్నారో అన్నీ ముందుంచాడు. త‌న రికార్డుల‌ను ఏక‌రువు పెట్టాడు. ప‌ద‌వులు అవ‌స‌రం లేదంటూనే.. రాక్ష‌స పాల‌న‌, ధ‌ర్మ‌యుద్దం, ప్ర‌జ‌లు తోడు రావాలి.. అంటూ ఏవేవో మాట్లాడి.. మ‌రీ దిగ‌జారిపోయిన రాజ‌కీయాల‌కు మేం ప‌రాకాష్ట అని నిరూపించుకున్నాడు. ఇంకా బాబు మార‌లేదు. ఒక్క‌టే మారాడు. ఏంటంటే రాజ‌కీయంగా ల‌బ్ది పొందాల‌న్నా, పార్టీని మ‌ళ్లీ బ‌తికించుకోవాల‌న్నా.. ఆనాడు అలిపిరి బ్లాస్టింగ్ త‌ర‌హా సానుభూతి కోసం వెంప‌ర్లాడిన‌ట్టు.. ఇలా వెక్కి వెక్కి వెక్కి ఏడ్చేందుకు కూడా వెనుకాడొద్ద‌ని. సిగ్గుప‌డొద్ద‌ని.

అటు జ‌గ‌న్‌కు, ఇటు బాబుకు ఎవ‌రు స‌ల‌హాదారులుగా ఉన్నారో.. ప్ర‌కాశ్ కిశోర్ త‌ర‌హా. మ‌రీ ఇంత దిగ‌జారిపోతే త‌ప్ప రాజ‌కీయాల్లో మ‌న‌లేమ‌ని వాడెవ‌డో చెప్పిన‌ట్టున్నాడు. అంతే వీళ్లిలా తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్న‌ట్టున్నారు. ఒక‌రికి మంచి మ‌రొక‌రు మ‌హాన‌టులే మీరు.

You missed