ధరణి ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా నిర్వహించిన
ప్రత్యేక కార్యక్రమానికి , ధరణి ఒక సంవత్సరం పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమానికి ట్రేసా అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి , కార్యవర్గ సభ్యులు , నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై సీ. ఎస్. సోమేశ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా ధరణి ఒక సంవత్సరంపై రూపొందించిన పుస్తకాన్ని అధ్యక్షులు రవీందర్ రెడ్ది కి సీ. ఎస్. సోమేశ్ కుమార్ బహూకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావ్ మానస పుత్రిక ధరణి విజయవంతం కావడానికి కలెక్టర్లు,తహసీల్దార్లు,మొత్తం రెవిన్యూ సిబ్బంది రాత్రింబవళ్ళు శక్తి వంచన లేకుండా క్రుషిచేసారని తెలిపారు.
ఈ సందర్భంగా సి ఎస్ గారితో కేక్ కట్ చేయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి పాల్గొన్నారు.