ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ వాంకెడే .. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వుయ్ ఆర్ విత్ యూ వాంకెడే అనే పోస్టింగులు దానికి లైకులు.. మద్దతుగా కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. అసలు ఈ సమీర్ వాంకెడే ఎవరు..? ఎందుకు అతనికి మద్దతు తెలుపుతున్నారు.?
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసింది ఎన్‌సీబీ. ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంకెడే పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నది. బెయిల్ కోసం షారూఖ్ ప్రయత్నించినా కోర్టు ఇవ్వలేదు. బెయిల్‌కు ఎన్‌సీబీ అడ్డుపడదని, దీనికి 25 కోట్లు లంచం కావాలని వాంకెడ్ డిమాండ్ చేసినట్లు షారూఖ్ వర్గం నుంచి కొత్తగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై పిర్యాదులు కూడా చేసుకున్నారు.
బాలీవుడ్‌తో పాటు జాతీయ మీడియా మొత్తం ఈ విషయంలో షారూఖ్ కు మద్దతుగా నిలబడింది. వాంకెడేను దోషిగా బోనులో ఎక్కించే ప్రయత్నం చేసింది. వాంకెడే అవినీతి పరుడు కాబట్టి.. ఈ కేసులో కూడా వాస్తవం లేదు.. అని తప్పుదోవ పట్టించి బలహీన పరిచే ఓ ప్రయత్నంగా ఇదంతా జరిగిందనేది మరో వాదన. జాతీయ మీడియా వాంకెడే వైపు లేకున్నా సోషల్ మీడియా మాత్రం వాంకెడేకు మద్దతుగా నిలిచింది. రియల్ హీరోగా కీర్తిస్తున్నది. తన కెరీర్‌లో తనకున్న క్లీన్ ఇమేజ్ ఆధారంగా వాంకెడేకు మద్దతు తెలుపుతున్నారు. బాలీవుడ్ హీరో కొడుకును కాపాడేందుకు వాంకెడేను విలన్ చేయాలని చూశారు. ఈ కేసునుంచి తప్పంచి .. మొత్తంగా ఈ కేసునే నిర్వీర్యం చేయాలని చూశారు. కానీ అతన్నే ఈ కేసు దర్యాప్తులో కొనసాగించేందుకు ఎన్‌సీబీ అంగీకరించిది. ఇది ఆయన విజయంగా భావిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మందికి వాంకెడే ఓ హీరో. వీళ్ల దృష్టిలో షారూఖ్ ఓ విలన్. ఓ జీరో..