తలసాని శ్రీనివాస్ యాదవ్ మీకు అల్కగ దొరికిండా బై. సరే అప్పుడు ఉద్యమంలో పాల్గొనలే. కేసీఆర్ను తిట్టిండు ఇష్టమొచ్చినట్టు.. అది పాతకథ. ఇప్పుడు ఆయన మంత్రి. రాజకీయ పునరేకీకరణలో భాగంగా తెలంగాణను కాపాడేందుకు, ప్రభుత్వ సుస్థిరతలో పాలుపంచుకుంటున్న ఓ నాయకుడు. కనీసం మనం మర్యాద ఇచ్చుకోవద్దా..? గౌరవించుకోవద్దా..? నిన్న ప్లీనరీలో తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఘట్టాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కు వెళ్లాడు. అక్కడ అన్ని ఫోటోలు తిలకించాడు. కేసీఆర్ను పోలీసులు అరెస్టు చేసిన ఓ ఫోటోను శ్రద్ధగా గమనించాడు. ఆ ఫోటోను క్లిక్మనిమనిపించారు కొందరు. ఇగో ఇప్పుడు అదే వైరల్ అవుతుంది. ఉద్యమంలో నువ్వెక్కడున్నావో చూసుకుంటున్నావా? కేసీఆర్ అడ్డంగా ఉన్నాడు గానీ, ఆ వెనుకే యాదవ్ కూడా ఉన్నాడు చూడండి .. అని మరికొందరు..ఇలా ఈ ఫోటోను తెగవాడేసుకుని, తమకు నచ్చిన, ఇష్టమొచ్చిన కామెంట్లూ పెడుతున్నారు. ఏడ దొరుకుతడా అని చూస్తరా ఏందీ…? తన మానాన తాను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమై పనిచేసుకుంటూ పోతున్నడు. ఆయన్ను అలా వదిలేయండి ప్లీజ్.