దుబాయ్‌లో మోసం చేసి వచ్చావని, తనకు ఇక దుబాయ్ వెళ్లే ఛాన్సే లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మొన్న చేసిన ప్రకటనపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈ రోజు స్పందించాడు. ఏకంగా ఆయన దుబాయ్ వెళ్లి మరీ అక్కడి నుంచి ఓ వీడియో రిలీజ్ చేశాడు. చూశావా..? నఏను దుబాయ్ వచ్చాను. నీలాగా నేను దొంగను కాదు.. అబద్దాల కోరును కాదు..అంటూ ఏవేవో కామెంట్లు చేశాడు.
ఈ దసరా నుంచైనా మారు బ్రదర్ అని కూడా చివరగా హితవు పలికాడు. అన్నీ ఫేక్ ముచ్చట్లు చెబుతూ ఇంకెన్ని రోజులు కాలం గడుపుతావంటూ విమర్శించాడు. పండుగ నాడు కూడా ఎమ్మేల్యే రాజీకీయాలు మాట్లాడటం ఆయనకే చెల్లిందని నెటిజన్లు జీవన్‌రెడ్డిపై ట్రోల్ చేస్తున్నారు. అసలు నువ్వు దుబాయ్ ఎందుకు వెళ్లావో చెబుతావా? అంటూ వెటకారాలు ఆడటం మొదలుపెట్టారు.
నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ఓ సందర్భమూ ఉండదు.. సమయమూ ఉండదు. అనుకున్నది చెప్పాలంటే ఓ వేదిక కూడా ఉండదు. ఇలా తమ కసిని మాటల రూపంలో తీర్చుకుంటారు. అందులోనూ ఆర్మూర్ రాజకీయాలంటే ఇంకా భలే గమ్మత్తుగా ఉంటాయి. ఫాక్షన్ రాజకీయాలను తలపిస్తాయి. పగబడితే వదిలేది లేదు. తనజోలికి వస్తే విడిచేది లేదు. వెంటాడి వేటాడాల్సిందే. అలా జీవన్‌రెడ్డి.. అర్వింద్ మీద పడ్డాడు… అర్వింద్.. మళ్లీ నేడో రేపో జీవన్‌ను అర్సుకుంటాడు. ఇలా ఆర్మూర్ రాజకీయాలు ఎప్పడూ రంజుగానే ఉంటాయి.