నిజామాబాద్‌లో ఓ బీజేపీ కార్పొరేటర్ భర్త కు డ్రగ్స్ అలవాటు ఉందట. డ్రగ్స్ మూలాలు ఇక్కడికీ విస్తరించాయి. తను డ్రగ్స్ వాడటమే కాకుండా.. ఇతర మహిళకు డ్రగ్స్ అలవాటు చేసి ఆమెతో నాలుగు నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నాడట. స్వయంగా ఈ విషయం చెప్పింది ఆ బాధిత మహిళ తరపు తల్లిదండ్రులు. కార్పొరేటర్ భర్త ఆకుల శ్రీనివాస్‌కు స్థానికంగా ప్రగతి హాస్పటల్‌లో పనిచేసే ఓ డాక్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
కొన్ని నెలల కిత్రం ఆ డాక్టర్ తండ్రి నాలుగో టౌన్ పోలీసులకు తన కూతురుకు మాయమాటలు చెప్పి కిడ్నాప్‌చేశాడని ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే బీజేపీ పెద్ద నేతలు రంగంలోకి దిగారు. కిడ్నాప్ అయిన డాక్టర్‌తో తన ఇష్టపూర్వకంగానే వెళ్లాలని పోలీసులకు చెప్పించి.. పిటిషన్ వాపస్ తీసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎఫ్ ఐఆర్ కాకుండా చేశామని లైట్‌గా తీసుకున్నారు.
తర్వాత కొద్ది రోజులకు కమ్మర్‌పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు నవాతే రంజిత్ ఓ వివాహిత మహిళతో అనుచితంగా ప్రవర్తించి ఆమెను లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆమె భర్త దేహశుద్ది చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవాతే రంజిత్ పై అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో బీజేపీ పెద్దలకు చర్యలు తీసుకోక తప్పలేదు. పార్టీకి రాజీనామా చేయించారు. ఆకుల శ్రీనివాస్ కేసు కూడా పార్టీకి తలవంపులు తెచ్చింది కాబట్టి.. ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. అంతటితో ఈ వివాదం సద్దుమనిగిందనుకున్నారు.
కానీ తాజాగా ఆకుల శ్రీనివాస్ మళ్లీ డాక్టర్‌తో సహజీవనం చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు నగరంలోని అతని అపార్ట్‌మెంటుకు వచ్చిన తల్లిదండ్రులు కార్పొరేటర్ ముందే ఆమె భర్తను చెప్పు తీసుకుని కొట్టి.. ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు. డాక్టర్ తండ్రి మాట్లాడుతూ.. ఆకుల శ్రీనివాస్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, తన కూతురుకు కూడా డ్రగ్స్ అలవాటు చేశాడని ఆరోపించాడు. ఇప్పుడిది ఇందూరు బీజేపీ పెద్దల తలకు చుట్టుకున్నది.