దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని టీఆరెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టుకుంది. దీన్ని పలుమార్లు సీఎం చెప్పాడు. కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లాయి. భూములు ఇచ్చేంందుకు కొనుగోలు చేయాలని. కానీ అసెంబ్లీ సాక్షిగా మేమేనాడూ చెప్పలేదని సీఎం చెప్పడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. వాస్తవంగా దళితుకు మూడెకరాల స్కీం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినట్టయ్యింది. దీంతో దీన్ని కవర్ చేసేందుకే దళిత బంధును కేసీఆర్ ప్రవేశపెట్టి… 10 లక్షల నగదిస్తే.. ఏమైనా వ్యాపారం చేసుకుంటారు.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దళితులకు మూడెకరాల స్కీం గురించి మరిచిపోతారని భావించాడు. కానీ అనూహ్యంగా ఈ సబ్జెక్టు గురించి సీఎం అసెంబ్లీలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మేమేనాడూ చెప్పలేదని సీఎం చెప్పడమే ఇక్కడ వివాదమైంది. అసలు ఈ స్కీం ఎందుకు ఫెయిలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది దళితులకు మూడెకరాలు వచ్చాయి? ఇదిగో ఇవీ ఆ వివరాలు..
-వాస్తవంగా ఓ పదిహేనేళ్ల క్రితం నుంచే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద దళితులకు ఒక ఎకరం భూమి ఇవ్వాలని ఉంది. కానీ అది పెద్దగా అమల్లోకి రాలేదు. టీఆరెస్ మాత్రం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడెకరాలు ఇవ్వాలని పెట్టకున్నది.
-కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. అసైన్డ్ భూమి ఎక్కడా లేదు కాబట్టి.. కొనుగోలు చేయాలి. దీనికీ కొన్ని నిబంధనలు పెట్టారు. మూడెకరాలు ఉండి ఓ బోరుంటే.. రెండు పంటలు తీసుకోగలిగేలా ఆ భూమి ఉంటే.. దానికి గరిష్ఠంగా ఎకరాకు రూ. 5.75 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు పెట్టి కొనుగోలు చేయాలి. అలా లేకుంటే కనిష్ఠంగా రూ. 4 లక్షలు .. ఆలోపు ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కడా అలాంటి భూములు అధికారులకు దొరకలేదు. కొన్ని చోట్ల దొరికినా కొందరికే పరిమితం చేశారు.
– అప్పటికే ప్రభుత్వానికి అధికారులు ఈ భూముల కొనుగోలు కష్టాల గురించి చెప్పారు. ఒక ఎకరా ఇస్తే బాగుంటుంది. ఎక్కువ మందికి ఇవ్వొచ్చని. కానీ ఇది ఎన్నికల హామీ వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. దీంతో ప్రభుత్వం ఆ రేటుకు ఉంటే కొనండి లేదంటే ఆపండి.. అనే స్థాయిలో ఆదేశాలిచ్చింది.
-అధికారుల భూముల కోసం వెతికి వెతికి వేసారి ఇక కాదంటూ చేతులెత్తేశారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 2 శాతం కూడా దళితులకు మూడెకరాలు ఇవ్వలేకపోయారు. ఇక అప్పట్నంచి దీని గురించి ఎలాంటి ముందడుగు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. దళితులూ ఇది మరిచిపోయారు.
– కొనిచ్చిన వారికి మాత్రం కొందరికి మంచి భూములు దొరికాయి. పంటలు పండించుకుంటున్నారు. కొందరికి పడావు భూములే మిగిలాయి.
– దళితబంధు ద్వారా దళితుల్లో మంచి పేరు తెచ్చుకుని పార్టీకి లబ్డి జరిగేలా కేసీఆర్ ఆలోచన చేశాడు కానీ.. ఇప్పుడు మూడెకరాలు మేం ఎప్పుడిస్తా అన్నం.. అని అసెంబ్లీలో అనడం .. సీఎం చెప్పిన మాటలకే గ్యారెంటీ లేదు అనే పరిస్థితికి వచ్చింది. నమ్మకం సడలుతున్నది. రేపు దళిత బంధు అంతటా అమలు జరుగుతుందా? హుజురాబాద్ ఎన్నిక తర్వాత ఇలాగే ఫెయిల్యూర్ స్కీంగా మిగిలిపోతుందా?