అవును మీరు విన్న‌ది నిజ‌మే.. రావ‌ణుడు క‌న్నుమూశాడు. 1980లో ఎంతో పాపుల‌ర్ అయినటువంటి రామాయ‌ణ్‌… అనే సీరియ‌ల్ మ‌నంద‌రికీ తెలిసిందే. అందులో రావ‌ణుడి పాత్ర ధ‌రించిన అర్వింద్ త్రివేదీ (82) గుండెపోటుతో రాత్రి తుదిశ్వాస విడిచాడు. రామాయ‌ణ్ సీరియ‌ల్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌నంద‌రికీ తెలుసు. సినిమా అయినా, సీరియ‌ల్ అయినా విల‌న్ అనే పాత్ర ఎంత బ‌లంగా ఉండి ర‌క్తి క‌ట్టిస్తేనే .. హీరోకు, ఆ సీరియ‌ల్‌కు అంత పేరొస్తుంది.

రామాయ‌ణ్ సీరియ‌ల్‌లో అర్వింద్ త్రివేదీతో పాటు అరుణ్ గోవిల్ రాముడు పాత్ర‌లో, దీపికా షికీలియా సీత‌గా , సునీల్ ల‌హిరీ ల‌క్ష్మ‌ణ్ పాత్ర‌లో పోటీలు ప‌డి న‌టించారు. అందులో అంద‌రిక‌న్నా హైలెట్‌గా న‌టించి మెప్పుపొందింది అర్వింద్ త్రివేదే. గ‌తంలో అర్వింద్ క‌రోనాతో మృతి చెందాడ‌ని సోష‌ల్ మీడియాలో వదంతులు వ‌చ్చాయి. ఈ త‌ప్పుడు ప్ర‌చారాన్ని ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌ధారి సునీల్ లహిరి అప్ప‌ట్లో ఖండించాడు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికాడు. ఇప్పుడు అర్వింద్ చ‌నిపోయిన విష‌యాన్నిసునీల్ క‌న్ఫాం చేశాడు. అత‌ని మ‌ర‌ణ వార్త విని మాటాలు రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో రామాయ‌ణ్ సీరియ‌ల్‌ను దూర‌దూర్శ‌న్ పునఃప్ర‌సారం చేసిన విష‌యం తెలిసిందే.

రావ‌ణ్ పాత్ర‌ధారి అర్వింద్ త్రివేదీ క‌రోనా టైంలో .. సీత అప‌హ‌ర‌ణం దృశ్యాన్ని అత‌ను చూస్తున్న వీడియో వైర‌ల్ అయ్యింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 16న రామాయ‌ణ్‌ను 7.7 కోట్ల మంది వీక్షించ‌డంతో స‌రికొత్త రికార్డు న‌మోద‌య్యింది. రామానంద సాగ‌ర్ ర‌చించి, దర్శ‌క‌త్వం వ‌హించిన రామాయ‌ణ్ ..33 ఏండ్ల త‌ర్వాత కూడా భార‌తీయ టీవీ వీక్ష‌కుల మ‌న‌స్సుల‌ను దోచుకున్న‌ది. ఎప్ప‌టికీ చెర‌గ‌ని ముద్ర వేసుకున్న‌ది.

You missed