నటించినప్పుడే కాస్త చూడాలనిపిస్తుంది. రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి, డైలాగులు వినిపించినప్పుడే కొంచెం పర్వాలేదనిపిస్తుంది. ఎప్పుడైతే నిజ జీవితంలో నిజ్జంగా మాట్లాడటం మొదలుపెడతారో.. ఇలా తమ మేథస్సు మురుగు నీటిలా ఉబికివస్తుంది. వారి పరిపక్వతా స్థాయి స్టామినా బయటపడుతూ ఉంటుంది. అవివేక రంగులు లేని ముఖాలు తెల్లగా పాలపోయి కనిపిస్తూ ఉంటాయి. వెండతెర మీద నీతులు కుప్పలుతెప్పలుగా చెప్తారు. ఇలా నిజజీవితంలో అంగీలాగు చిరిగేలా కొట్టుకుంటారు. కడుపులో కసంతా తీర్చుకునేందుకు ఎంతటికైనా దిగజారుతారు. నా వంశప్రతిష్టలు, నా వారసత్వం అని చంకలు గుద్దుకుంటారు. మాకంటే ఎవరు తోపు కాదని.. అందరినీ గేలి చేసి నవ్వులపాలవుతారు. సినిమా తారలంటే ఇంతే. వెండితెర మీద ఒకలా..? నిజజీవితంలో ఇలా…