అసలే రోజులు బాగాలేవు ఆయనకు. ఓవర్ యాక్షన్ చేసి ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవి ఊడింది. మళ్లా లేచి అంతా సెట్ చేసుకుని, నిలదొక్కుకుని, కేసీఆర్‌తో సానుభూతి సంపాదించి, మళ్లా ఏదైనా మంత్రి పదవి రాకపోతుందా అని ఎదురుచూసి.. భజన చేసే క్రమంలో బోల్తాపడి… ఏదో ఇలా తండ్లాడుతున్న టైమ్‌లో.. ఈ బతుకమ్మ చీరలు వచ్చి కొంప ముంచాయి. ఏదో ఫ్లోలో అన్నీ తానై కేసీఆర్ మహిళలు అండగా ఉంటున్నాడు అని చెప్పాలనుకున్నాడు. భర్తగా కూడా ఆయన ఆదుకుంటున్నాడని ఏదో అలా నోరు జారాడు. కానీ అసలు ఉద్దేశం మాత్రం ఎవరూ అర్థం చేసుకోలె. అందరూ అపార్థమే చేసుకున్నారు పాపం.
అయినా టైం బాగాలేనప్పుడు … ఏది చేసినా అంతే. మంచి మాట చెప్పబోయి నోరు జారాడంతే.. దానికే ఇంత రాద్దాంతమా? అసలు ఇంత మానవత్వం కూడా లేదు ఈ మనుషుల్లో. మరీ ఇంతలా చెడిపోతారని అనుకోలేదు.. ఛీ ఛీ. సరే .. ఇంకా చచ్చినపామును చంపాల నాయన. మధ్యలో ఈ రాసలీలల వీడియో ఎక్కడి నుంచి తవ్వి తీసిండ్రురా నాయన… అసలు అందులో నా తప్పేమేన్నా.. ఉందా? ఏదో పార్టీ జరుగుతంది. అలా ఆనందంలో అంతా లీనమై ఉంటే.. అందులోనూ ఈ తప్పులెతుకుడేందిరా బాబు..? నన్ను ఇగ బతకనీయరా..! మీ అందరి పేరు మీద సూసైడ్ లెటర్ రాసి చస్తరరేయ్.. వెధవల్లారా.. నన్నొదిలెయ్యండిరా.. మీ కాల్మొక్తా..!!