బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. మహిళా లోకం భగ్గుమంటున్నది. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆరే అన్నీ తానై చేస్తున్నాడని చెప్పే క్రమంలో .. భర్తలా కూడా కేసీఆర్ ఉంటున్నాడనే అర్థం వచ్చేలా మాట్లాడంతో వివాదం రేగింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద వార్ నడుస్తున్నది. రాజయ్యను ఆడుకుంటున్నారు. మహిళలు ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. బతుకమ్మ చీరలు తీసుకోబోమని తెగేసి చెప్తున్నారు. చిన్న పొరపాటు మాట రాజయ్య కొంపముంచేలా ఉంది. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్లు కూడా రాజయ్య మాటలను తీవ్రంగా ఖండిస్తూ.. తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఆత్మగౌరవం ఉన్న మహిళలలెవరూ ఈ చీరలు తీసుకోవద్దని కూడా పిలుపునిస్తున్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో ….
https://m.facebook.com/story.php?story_fbid=1970588339781818&id=100004920132286