ఏ ఏముందిలే జీవితం.. ఇలా గడిచిపోతే చాలు. ఏ చీకూ చింత లేకుండా హాయిగా బతికేస్తే చాలు. కష్టాలు రాకుండా ఆనందంగా కాలం గడిస్తే అదే పదివేలు. ఇలా అనుకుని బతికే జీవితాలు.. గుంపులో గోవింద లాగే ఉంటాయి. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం తపన పడని మనుషులు.. తపించి, గుర్తింపు పొందే మనుషులను అబ్బుర పడి చూస్తారు గుంపులో నిలబడి. అవును .. బాసు.. వాడు నిజంగా గ్రేటే కదా. మనమైతే అలా చేయలేము బాసు. కానీ అలా చేయడం అందరితో కాదు కూడా. ఏమంటావ్? అని పక్కోడి సమర్థత కోసం.. తన అసమర్థత కప్పిపుచ్చుకోవడం కోసం తపిస్తూ ఉంటారు.
అంతే తప్ప ఏదో చేయాలి, ఏదో కావాలి.. అనే తెగింపు, ధైర్యం, పట్టుదల రావు, రావాలని కోరుకోరు. అద్భుతాలు జరిగితే కళ్లప్పగించి చూస్తారు. అవమానం పాలైతే పగలబడినవ్వుతారు అదే గుంపులో నిలబడి. కొన్ని జీవితాలంతే. మరికొన్ని జీవితాలు ఇంతే.