టీఆరెస్ జిల్లా అధ్యక్షుల ఎంపిక దాదాపు ఖరారైంది. రేపు ఈ జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విడుదల చేయనున్నాడు. ఈ నెల 20నే అధ్యక్షుల పేర్లను, జిల్లా కమిటీలను ప్రకటించాల్సి ఉండే. కానీ జాప్యం జరిగింది. 30న ప్రకటించాలని కేటీఆర్ భావించాడు. ఆ మేరకు జిల్లా నేతలతో విడివిడిగా భేటీ అవుతూ అధ్యక్షులు ఎవరుంటే బాగుంటుంది అనే విషయంలో క్లారిటీ తీసుకున్నాడు. జిల్లా మంత్రులతో కూడా చర్చించాడు. మొత్తానికి ఫైనల్ నిర్ణయాలు పూర్తయ్యాయి. ఈ సారి అధ్యక్ష పదవి పవర్‌ఫుల్‌గా ఉండే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నది. దీంతో జిల్లా ప్రెసిడెంట్ పదవి పార్టీలో ప్రాధాన్యత సంతరించుకున్నది.
కొంత మంది ఎమ్మెల్యేలు కూడా అధ్యక్షులుగా చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ కేటీఆర్ ఒప్పుకోలేదు. కొన్ని చోట్ల తమ నియోజకవర్గాల నుంచి అధ్యక్షులుగా ఇవ్వొద్దనే విజ్ఞప్తులు కూడా కేటీఆర్‌కు చేరాయి. కానీ కేటీఆర్ ఇవేమీ పట్టించుకోలేదు. పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసే లీడర్ వైపే ఆయన ఆలోచనలు సాగాయి. ఆ విధంగానే అధ్యక్ష నియమాకం జరిగింది. రేపు జాబితా విడుదల అయిన తర్వాత అధ్యక్షుల ఎంపికలో కేటీఆర్ మార్క్ స్పష్టంగా కనిపించనుంది.