ఓ పత్తి చేనులో కూలీలు వాళ్లు. పనిచేసి అలసిపోయి కొద్ది సేపు సేద తీరారు. అక్కడా హుజురాబాద్ ముచ్చటే వచ్చింది. అంతా మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలొచ్చినయంట కదా…అని అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టిర్రు. యే కచ్చితంగా రాజేందర్ అన్ననే గెలుస్తడు.. అన్నది ఓ అక్క. అన్నదే తడువు ఓ వీడియో తీసింది. ఈటల రాజేందర్‌కు ధైర్యం చెబుతూ ఓ నాలుగు మాటలు మాట్లాడింది. కేసీఆర్ ఎన్ని పథకాలు పెట్టినా.. మన మొర దేవునికి ముడుతుంది.. నువ్వేం ఫికరు చేయకు మనమే గెలుస్తున్నమని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో హుజురాబాద్‌లో చక్కర్లు కొడుతుంది.