రేవంత్‌రెడ్డికి ఇప్పుడు కొత్త అస్త్రం దొరికింది. డ్ర‌గ్స్ కేసులో ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సినీతార‌ల‌లో అప్పుడు ద‌గ్గుబాటి రాణా, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎందుకు రాలేదు.. వీరిని రాకుండా ఎవ‌రు అడ్డుకున్నారు? అంటూ కేటీఆర్‌ను టార్గెట్ చేసి ఇవాళ మాట్లాడిండు. ఈ డ్ర‌గ్స్ కేసును కేటీఆర్ మెడ‌కు చుట్టేందుకు రేవంత్ రెడ్డి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రేవంత్ వేస్తున్న ఉచ్చులో కేటీఆర్ కూడా ఈజీగానే చిక్కుతున్నాడు. ర‌క్తం, వెంట్రుక‌లు ఇస్తానంటూ .. చెప్పాడు. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న రేవంత్ మ‌రింత ఇరుకున పెట్టేందుకు రాణా, ర‌కుల్ ప్రీత్ సింగ్ పేర్ల‌ను తెర‌పైకి తెచ్చాడు. కేటీఆర్ గోవాకెందుకు వెళ్లాడు? అధికారిక మీటింగా? ప‌ర్స‌న‌ల్ టూరా? సినీ తార‌ల‌తో కేటీఆర్‌కు సంబంధాలున్నాయి.. అని మొన్న బ‌క్క జ‌డ్స‌న్ అనే కాంగ్రెస్ నేత‌తో ఈడీ జేడీకి ఫిర్యాదు చేయించిన విష‌యం తెలిసిందే. వాళ్లు ఉచ్చు వేయ‌డం.. కేటీఆర్ అవ‌లీల‌గా అందులో ఇరుక్కోవ‌డం జ‌రుగుతూనే ఉంది. తాజాగా రేవంత్ మ‌రింత ఇరుకున పెట్టేలా అప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ విచార‌ణ‌కు రాణా, ర‌కుల్ ఎందుకు హాజ‌రుకాలేదు? అంటూ కొత్త విష‌యాన్ని తెర‌పైకి తెచ్చాడు. ఈ ఈడీ విచార‌ణ ఏమిటో గానీ, అది కేటీఆర్ చుట్టూ తిప్పేందుకు మాత్రం కాంగ్రెస్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. దీనికి ఇప్ప‌ట్లో ముగింపు కూడా ప‌డేలా లేదు. మున్ముందు ఇంకెన్ని ఆరోప‌ణ‌ల‌ను కేటీఆర్ ఎదుర్కోవాల్సి వ‌స్తుందో..?

You missed