కాంగ్రెస్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ సందర్భానుసారం టైమ్లీగా పేలుతున్నాయి. కరెక్ట్ స్పాట్ చూసి గురి పెట్టి బాణాలు వేయడంలో కాంగ్రెస్ ముందుంటుంది. ఇటు టీఆర్‌ఎస్‌నే కాదు.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదాకు ప్రధాన అడ్డంకిగా ఉన్న బీజేపీని అవసరం వచ్చినప్పుడల్లా ఆడుకుంటున్నది. నిన్న నిర్మల్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినం బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యాడు.

‘రాక్షస రజాకారుల మారణకాండనకు ఎదురొడ్డి నిలిచి నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించి తెలంగాణను విమోచనం చేసిన ఆనాటి వీరుల పోరాటాన్ని స్మరించుకుంటూ..’ అనే నినాదంతో బీజేపీ ఈ సభ పెట్టింది. ఇక్కడే చరిత్ర వక్రీకరణ జరిగింది. వాస్తవంగా 150 దశకంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా గోండులు తిరుగుబాటు చేశారు. 1940 దశకంలో రాజాకార్ల పై పోరాటం జరిగింది. ఈ రెండింటికి పొంతన లేదు. కానీ బీజేపీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేసింది.

రాంజీ గోండు, కొమురంభీం, గోండుల చరిత్రను రాజాకార్ల పై పోరాటానికి మూడిపెడుతూ తెలంగాణను విముక్తి కలిగించాలని బీజేపీ పేర్కొన్నది. ఇదే విషయాన్ని అమిత్ షా చేత బహిరంగ సభలో చెప్పిచింది. పూర్తిగా చరిత్రను వక్రీకరించే ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు. ఈ రోజు ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీ ఘోర తప్పిదాన్ని , చరిత్ర వక్రీకరణను తూర్పారబట్టాడు. సభ సక్సెస్ అయిందని చంకలు గుద్దుకుంటున్న బీజేపీ పార్టీ గాలి తీసేసాడు రేవంత్ రెడ్డి.

ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ పసిగట్ట లేకపోయింది. కవులు, కళాకారులు, మేథావులు ఎంతో మంది పార్టీలు కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా ఉన్నారు. కానీ ఎవరూ ఎవరికి సలహా ఇచ్చేటట్టు లేరు. ఆ సలహాను ఎవరూ పుచ్చుకునేటట్టు లేరు.. పట్టించుకునేటట్టు లేరు. కాంగ్రెస్ మాత్రం సకాలంలో అందిపుచ్చుకుంది. ఒక్క ప్రెస్‌మీట్‌తో రేవంత్ రెడ్డి బీజేపీకి రావాల్సిన మైలేజీ మొత్తం కాంగ్రెస్ ఖాతాలో వేసేసుకున్నాడు. టీఆర్‌ఎస్ నోరెళ్లబెట్టి చూస్తుంది. ఆ పార్టీ మేథావులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.

You missed