దర్శకుడు రాజమౌళికి మన రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమిటీ లింకు? ఆయనో ప్రముఖ దర్శకుడు.. పాన్ ఇండియా సినిమాలతో తెలుగు వారి ఖ్యాతిని నలుదిశలా చాటినవాడు. ఆయనకు మన బీజేపీ బండి సంజయ్‌కు ఏమైనా దగ్గర సంబంధాలున్నాయా? పైన హెడ్డింగ్ చూస్తే ఇవే డౌట్లొస్తాయి. అలా డౌట్ రావడమే కరెక్టు. ఎందుకంటే.. రాజమౌళి ఆలోచనలు.. మన బండి సంజయన్న ఆలోచనలు ఇంచు మించు ఒకటిగానే ఉన్నాయి. కమర్శియల్ మేళవింపులతో భారీ బడ్జెట్‌తో తీసే సినిమా త్రిపుల్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లు హీరోలు. ఇది చరిత్రకు సంబంధించిన సినిమా. ఒకరిది అల్లూరి సీతరామరాజు పాత్ర.. మరొకరిది కొమురం భీం పాత్ర. చరిత్రలో ఈ రెండు పాత్రలకు పొంతన లేదు. కానీ మన జక్కన్న మాత్రం ఈ రెండు పాత్రలను ఒకే నేపథ్యంగా, ఒకే ఉద్యమంగా చూపించేయబోతున్నారు. ఇద్దరినీ వెండితెరపై కలపబోతున్నాడు. కొమురం భీం నిజాంకు వ్యతిరేకంగా, అల్లూరి బ్రిటీష్‌లకు వ్యతిరేకంగ పోరాటం చేశారు. చరిత్రను వక్రీకరించబోతున్నాడు.
అసలు కొమురం భీం నేపథ్యం ఒకటి.. అల్లూరి సీతరామరాజు పోరాట మార్గాలు… ఇద్దరివీ వేర్వేరు. కానీ ఆర్. ఆర్. ఆర్ సినిమా కల్పిత కథతో రాజమౌళి ఈ చరిత్రను తిరగరాసి బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించబోతున్నాడు. ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తున్నది. సెప్టెంబర్ 17ను విమోచర దినంగా పాటించి .. రాజకీయ లబ్ది కోసం ఏదో చేయబోయింది. దానికి రాంజీ గోండు, కొమురం భీం పోరాటాన్ని రాజకార్ల పోరాటానికి లింకు చేసింది. ఈ రెండు వేర్వేరు పోరాట సంఘటనలు. కానీ ఈ రెంటినీ కలిపేసింది. దీన్ని కాంగ్రెస్ పట్టేసింది. రేవంత్‌రెడ్డి దీన్ని ఎండగట్టాడు. చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్డిపొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. కానీ బీజేపీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. జనాన్ని ఎంతగా డైవర్టు చేశామనేదే దానికి కావాలి. సేమ్ మన రాజమౌళి లెక్కనే. ఆయన కూడా చరిత్రను ఎన్ని వంకర్లు తిప్పితే ఏందీ..? సినిమా హిట్టైందా ? లేదా? అనేది ముఖ్యం. ఈ ఇద్దరిదీ ఇదే సక్సెస్ ఫార్మూలా అన్నమాట.