‘‘ఎవడూ దొరకలేదారా భయ్.. పోయ్‌పోయ్ సోనూసూదే దొరికాడా?’’

‘‘అవును సోనూసూద్ ఇంటి పై ఐటీ దాడులు చేయాల్సిందే. లేకపోతే మరీ రెచ్చిపోయి ధానధర్మాలు చేయడమేంది బ్రో’’
‘‘ఇంత మంది హీరోలున్నారు. అంటే వారికి సోయి లేదా? ప్రజలకు సేవ చేయాలనే తపన లేదా?’’
‘‘ఉంటే మరి చేయొచ్చు కదా?’’
‘‘వాళ్లు చేద్దామనేలోపే సోనూసూద్ అత్యుత్సాహం ప్రదర్శించి, ఓవర్ యాక్షన్ చేసి తనకే పేరు రావాలనే స్వార్ధంతో ఇదంతా చేశాడు. ’’
‘‘అవునా? దీని వెనుక ఇంత అర్ధముందా? సోనూసూద్ అంత స్వార్ధపరుడా?’’
‘‘కాకపోతే ఏంది భయ్. ఇలాంటివన్నీ హీరోలు చేయాలి కదా. ఈ విలన్‌కేం పని?’’
‘‘అవునూ.. హీరోలకంటే ఈ విలన్ దగ్గరనే పైసలు బాగున్నయా?’’
‘‘ఇప్పుడంతా విలన్ల జమానా నడుస్తుంది కదా భయ్. మంచి ఫామ్‌లో ఉన్నాడు మనోడు. బాగా పైసలు సంపాదించాడు. ఎక్కడ ఎవరికి సహాయం కావాలన్నా వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాడు. అవసరమా?’’
‘‘కరోనా సమయంలో కూడా భోజనాలు, ట్రావెల్స్, ఆక్సిజన్ ప్లాంట్లు.. ఏవేవో వేశాలేశాడు. తెలియకడుగుతా.. ప్రభుత్వాలేవా? పార్టీల్లేవా? నాయకుల్లేరా? ఈయనకెందుకు అంత గులా?’’
‘‘కోట్లు గుమ్మరించి, అన్ని అడ్డదారులు తొక్కి ఎలాగో అలాగా గెలిస్తే ప్రజల వద్ద మంచి పేరు సోనూసూద్ ఎలా కొట్టేస్తాడు? లీడర్లేమన్నా పిచ్చినాకొడుకులా?’’
‘‘ఆరే పాపం..! ఆయన దగ్గర ఆస్తులు కూడా పెద్దగా లేవంట కదా భై. ఉన్న ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి ఏదో ప్రజలకు సాయం చేశాడంటా కదా.’’
‘‘ అంటే అన్నారంటారు. గతిలేనిది ఎందుకు అంత పోకడా? ఏదో పిచ్చిపిచ్చి విలనీ వేశాలు వేసుకుంటూ అలా బతుకొచ్చుకదా..! ’’
‘‘అంటే నువ్వు కూడా ఒప్పుకుంటున్నట్టే కదా. అతని దగ్గర ఆస్తులు పెద్దగా లేవని. మరి ఐటీ దాడులు ఎందుకు?’’
‘‘మా బంగారు పుట్టలో వేలు పెడితే మేం కుట్టమా భై. మాకు రావాల్సిన మైలేజీ ఎవడో కోన్‌కిస్కా గొట్టం గాడికి వస్తే మేం ఊకుంటమా?’’
‘‘ఇంకోసారి మా జోలికి రాకుండా ఉండేందుకు ఇదో గుణపాఠం. ఇంకా మారలేదనుకో.. ఆ విలనీ వేశాలు రాకుండా చేస్తాం. బజారుకీడుస్తాం. బతుకు బర్బాద్ చేస్తం. చివరికి మేమే వెళ్లి వాడిని ఆదుకుని ప్రజాసేవ అంటే ఇదీ అని తెలియజేస్తాం. నటించడమంటే ఇలా ఉంటుందని వాడికి కొత్తగా నటన కూడా నేర్పుతాం.’’

 

You missed