నమస్తే తెలంగాణ యాదాద్రి కొత్త టీమ్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నది. ఇక్కడ మూమూళ్లు ఇస్తేనే రిపోర్టర్ ఉంటాడు. లేకపోతే పీకేసి ఇంకొకరి పెడతారు. కొత్త ఎడిటర్ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ టీమ్ కొత్త వివాదాలకు కేంద్రబిందువైంది. అంతకు ముందు సీనియర్ రిపోర్టర్ భాస్కర్‌ను కొత్త ఎడిటర్ ..అనేక వేధింపులకు గురిచేసి, తనంతట తాను తప్పుకునేలా చేసి తన సొంత ఎజెండాను అమలు చేశాడు. అతని స్థానంలో దేవరకొండ డేట్లైన్ రాసే ఓ రిపోర్ట్‌ను తీసుకువచ్చి జిల్లా బ్యూరో చేశాడు.
ఇందులో పెద్ద ఎత్తున చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. కొత్తోడు వచ్చిన తర్వాత ఇక్కడ అవినీతికి దర్వాజాలు తెరుచుకున్నాయి. నెల వారీ మామూళ్లు ఇవ్వకపోతే పాత రిపోర్టర్లను తీసేశాడు. వీరి స్థానంలో కొత్తోళ్లు వచ్చారు. యాదగిరి గుట్ట ఆర్సీగా ఉన్న అతని పై భార్య నిర్భయ కేసు పెట్టేందుకు సిద్ధపడింది. అంతటి ఘనుడనమాట. ఎక్కడో ఇరవై కిలో మీటర్ల దూరంలో ఇతనుంటాడు. గుట్టలో ఉండడు. ఎక్కడుంటే ఏంటీ? మామూళ్లు ఇస్తే చాలు.
కొత్త బ్యూరో వచ్చిన మూడు నెలలకే అవినీతి ఆరోపణలు హెడ్ ఆఫీస్‌కు వెల్లువలా వచ్చపడ్డాయి. ఆలేరు రిపోర్టర్ బ్యూరో తనకు రెండు లక్షలు ఇవ్వల్సిందిగా డిమాండ్ చేశాడని ఆధారాలతో సహా మేనేజ్మెంట్కు చెబితే త్రీమెన్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. చర్యలు మాత్రం తీసుకోలేదు.
యాదాద్రిని కేసీఆర్ అద్భుత దేవాలయంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నాడు. కానీ ఈచోటనే ఆయన పత్రిక అన్యాక్రాంతమైంది. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. వివాదాలకు కేంద్రబిందువైంది.
