ఎన్టీఆర్ .. ఏఎన్నార్ … తెలుగు లెజెండ్స్ .

ఎన్టీఆర్ ప్రజల మనిషి . ఏఎన్నార్ ఫ్యామిలీ మాన్.

నటుడుగా వున్నప్పుడే తన బిజీ షెడ్యూల్స్ కారణంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఎన్టీఆర్ కు ఉండేది కాదు . నాగేశ్వరరావు తన ప్రొఫషనల్ లైఫ్ ను, ఫామిలీ లైఫ్ ను బాలన్స్ చేసేవాడు .

రాజీకీయాల్లో వచ్చాక తన జీవితాన్ని పూర్తిగా పబ్లిక్ కోసం అంకితం చేసాడు ఎన్టీఆర్ . నాగేశ్వర రావు పాలిటిక్స్ వద్దనుకుని సమయాన్ని కుటుంబానికే కేటాయించాడు .

అనారోగ్యం .. రెండో పెళ్లి .. క్షీణించిన ఆరోగ్యం .. పదవి పోవడం .. హఠాన్మరణం ..అప్పటిదాకా తిరుగులేని రారాజుగా రాణిస్తూ ఉన్న ఎన్టీఆర్ కు చివరి దశ మాత్రం బాధాకరంగా నడిచింది . ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కృష్ణుడి లాంటి వాడు . కృష్ణుడు పబ్లిక్ లైఫ్ కు ఇచ్చినంత ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వలేదు .

మరో పక్క నాగేశ్వర రావు మంచి ఆరోగ్యం తో { యాభై లో వున్నప్పుడే గుండె ఆపరేషన్ జరిగినా } తొంబై ఏళ్ళు పరిపూర్ణ జీవితాన్ని గడిపాడు . కుటుంబానికి అనేక తరాల కు సరిపడినంత ఆస్తిని సంపాదించాడు . నాగేశ్వర రావు కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలను ఎంతలా చూరగొన్నాడు అంటే అయన మరణించినప్పుడు కొడుకు నాగార్జున వెక్కి వెక్కి ఏడవడం మనం అందరం చూసాము .

నాగేశ్వర రావు వారసుడిగా నాగార్జున ఉన్నత శిఖరాలను అందుకొన్నాడు . స్టూడియో ఇతరత్రా వ్యవహారాలను చూసుకొంటూ వస్తున్నాడు . వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చెయ్యడం మంచిది కాదు . కానీ ఇక్కడ తప్పడం లేదు . నాగార్జున మొదటి పెళ్లి విఫలం అయ్యింది . సరే విడిపోయారు . నాగార్జున తోటినటి అమలను పెళ్లి చేసుకొన్నాడు . మొదటి భార్యతో తనకు కలిగిన సంతానమే నాగచైతన్య .

అమ్మ .. నాన్న .. పిలల్లు .. ఇదే బొమ్మరిల్లు . ఇంట్లో అమ్మ అనురాగం .. నాన్న రక్షణ కావాలి అని అందరూ కోరుకొంటారు . అమ్మ ఒక చోట, నాన్న ఒక చోట ఉండడం పిల్లల జీవితం లో పెద్ద వెలితి . కుంటుబడిన బాల్యం .. తాము ఏమి కోల్పోయామో కూడా అలంటి పిల్లలకు తెలియదు . నాగ చైతన్య ది.. పాపం .. అలాంటి బాల్యమే .

నాగార్జున వివాహేతర సంబంధాలను గురించి తెలుగు నాట కథలు కథలుగా చెప్పుకొంటారు . అయన భార్య అమలకు లేని బాధ మనకెందుకు అని అనుకోవచ్చు . ఇక్కడిదాకా కూడా కథ ఓకే .

మనం నాటే విత్తనాలే బట్టే పైరు ఉంటుంది . అక్కినేని ఫామిలీ లో ఇప్పుడు తీవ్ర సమస్యలు . ఒక పక్క మేనల్లుడు కీర్తి రెడ్డి తో విడాకులు తీసుకొన్నాడు . ఇక పెళ్లి చేసుకోను అని ఇంటర్వ్యూ లు ఇచ్చాడు . మరో పక్క తన పెద్ద కొడుకు నాగ చైతన్య నటి సమంత తో విడాకులు తీసుకోనున్నాడు అని వార్తలు . మరో పక్క ఆస్థి గొడవలు .

అరేయ్ అది వారి వ్యక్తిగత వ్యవహారం .. నాకేంటి అని మీరు అడగవచ్చు . నిజమే .. అది వారి వ్యక్తిగత వ్యవహారమే .. వాటి గురించి కామెంట్ చేసే హక్కు మనకు లేదు . కానీ వారిది గ్లామర్ ఫామిలీ .. మంచి అయినా చెడు అయినా వారిని చూసి నలుగురు నేర్చుకొంటారు . అందుకే ఈ పోస్ట్

పైన చెప్పినవి అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నది ఒక ఎత్తు . నాగార్జున బ్రోతల్ హౌస్ నిర్వహకుడు అని లెఫ్ట్ పార్టీ నాయకుడు ఒక వైపు, బిగ్ బాస్ .. దాని నిర్వాహకుడు నాగార్జున కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు అని రైట్ పార్టీ అంటే బీజేపీ నాయకులు మరో వైపు వ్యాఖ్యానిస్తున్నారు .

రెండేళ్లలో నాగేశ్వర రావు శతజయంతి . తొంబై ఏళ్ళు నిండు జీవితాన్ని గడిపి, ఫామిలీ కోసం ఆరాటపడిన నాగేశ్వర రావు ఆత్మ స్వర్గం లో ఎంతగా క్షోభపడుతుందో కదా !

ముర్డోక్ అనే మానవశాస్త్రవేత్త 550 మానవ సమాజాలను పరిశీలించి ఫామిలీ ప్రతి సమాజం లో కీలక పాత్ర పోషిస్తుంది . మానవ జీవనానికి , ఎదుగుదలకు , సమాజ మనుగడకు కుటుంబమే మూల స్థంభం . కుటుంబ వ్యవస్థ నాశనం అయితే సర్వ నాశనమే అని చెప్పాడు .

కృష్ణుడు లోకనాయకుడు .. కానీ ఫెయిల్యూర్ ఫాదర్ . జీవితం లో ఉన్నత శిఖరాలు అందుకొన్న అనేక మంది ఫెయిల్యూర్ ఫాథర్స్ గా మిగిలి చివరి దశలో మానసిక క్షోభ ను అనుభవించారు .

అక్కినేని నాగేశ్వర రావు కుటుంబం .. కావాలి అందరికీ ఆదర్శం . అక్కినేని నాగార్జున కుటుంబం కాకూడదు ఎవరికీ ఆదర్శం .

కుటుంబ వ్యవస్థను నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది . లేక పొతే సర్వ నాశనం తప్పదు . ఇది సెంటిమెంట్ .. ఆయింట్మెంట్ కాదు . సైన్స్ .. సోషల్ సైన్స్ .. ఆంథ్రోపాలజీ .. సోషియాలజీ ..

వ్యక్తుల జీవితాలపై కామెంట్ చేసినందుకు సారీ ..

Amarnath Vasireddy

You missed