మూడు నెలల తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించాడు బోధన్ ఎమ్మెల్యే షకీల్. పార్టీ పెద్దల పై అలిగి ఇటు వైపు రావడమే మానేశాడు. మొన్న ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమానికి పిలిపించి మచ్చిక చేసి పంపించారు. ఈ రోజు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశాడు. రెంజల్ మండలం నీల పేపర్ మిల్ కాలనీ వాసులు ఏడేండ్లుగా డబుల్ బెడ్ రూంలు ఎందుకు కట్టివ్వలేదని నిలదీశారు. కారును అడ్డుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పటి వరకు ఓపిక పట్టిన మన ఎమ్మెల్యే ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కొపంతో బూతులందుకున్నాడు. ఆ కాలనీ వాసులేమి తక్కువ తినలేదు. ఎమ్మెల్యే అన్న బూతునే తిరిగి అన్నారు. దీంతో కారు దిగాడు ఎమ్మెల్యే. కొట్టేందుకే సిద్ధమయ్యాడు. అనుచరులు సముదాయించి లోపల కూర్చోబెట్టారు. అయినా ప్రజలు ఊరుకోలేదు. నిలదీస్తూనే ఉన్నారు. మళ్లీ కారు దిగాడు. మళ్లీ కూర్చున్నాడు. ఏమేమో అన్నాడు.. వారితో ఏవేవో మాటలు పడ్డాడు. మూడు నెలల తర్వాత వస్తే ఇదేం సత్కారంరా నాయనా..! అని తనకు జరిగిన చేదు అనుభవంతో వెనుదిరిగాడు షకీల్.

You missed