ఈటల రాజేందర్ పై కేసీఆర్ కక్ష కట్టిన ధోరణిలో వ్యవహరిస్తున్న తీరు.. ఇక్కడ గెలుపు కోసం పరిపాలన మొత్తం దీని కేంద్రంగానే కొనసాగించడం కేసీఆర్ ప్రతిష్ఠ మసకబారేలా చేస్తున్నది. హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాన్ని కేసీఆర్ భూతద్ధం లో చూస్తున్నాడు. ఈటల రాజేందర్‌ను తనే హీరోను చేస్తున్నాడు. మంది, మర్భాలాన్ని మోహరించి శక్తులన్ని ఊసుగొలిపి చివరాకఖరుకు అనుమానం వీడక.. ఎన్నికను మూడు నెలల పాటు వాయిదా వేసేలా చేసి అష్టకష్టాలు పడుతున్నాడు కేసీఆర్.
హుజురాబాద్
ఉప ఎన్నిక విషయంలో గెలుపు కోసం ఆయన పడుతున్న తాపత్రయంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు ఆత్మ సంరక్షణలో పడేస్తున్నాయి. సెల్ఫ్ గోల్ చేస్తున్నాయి. తాజాగా కౌషిక్ రెడ్డి ఉదంతం మళ్లీ చర్చకు వచ్చింది. గవర్నర్ కోటాలో కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాల్సిన కేసీఆర్ హామీకి గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అసంతృప్తిని వ్యక్తం చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. కౌషిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని నిర్ణయం తీసుకున్న వెనువెంటనే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా కేసీఆర్ పట్టించుకోలేదు. చివరికిలా తను తీసుకున్న నిర్ణయాలు అభాసుపాలు కావడం రాజకీయాల వర్గాల్లో చర్చకు దారి తీసింది.
