రాష్ట్ర రాజ‌కీయాల్లో మాట‌ల దాడులు పెరుగుతున్నాయి. ప‌ర‌స్ప‌ర దూష‌ణ‌లతో నేత‌లు చెల‌రేగిపోతున్నారు. తిట్లు కామన్‌గా మారాయి. ఆరోప‌ణ‌ల‌కు అంతులేకుండా పోతున్నది. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌కు ఓ హ‌ద్దు, ప‌ద్ధ‌తి చేరిపేసుకున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ న‌డుస్తోంది. ప్ర‌తిప‌క్షాలు దీనినే న‌మ్ముకున్నాయి. విషాద‌మేమిటంటే.. ఇక పై టీఆరెస్ కూడా ఇదే పంథాను ఎంచుకునేందుకు సిద్ధ‌మైంది. ఆల్‌రెడీ స్టార్ట్ చేసింది. ప‌ర‌స్ప‌ర దూష‌ణల తీవ్ర‌త స్థాయి ఎక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిందంటే.. అండర్ వేర్ ల గురించి మాట్లాడుకునే దాకా.

అర్వింద్ ఇలాంటి మాట‌ల రాజ‌కీయాలకు ఆజ్యం పోస్తే.. రేవంత్ రెడ్డి దాన్ని అందిపుచ్చుకుని మ‌రింత పీక్‌కు తీసుకువెళ్లాడు. కాంగ్రెస్ ద్వారానే మీ కుటుంబం ల‌బ్ధి పొందింద‌ని.. నువ్వు వేసుకున్న అండ‌ర్ వేర్ కూడా కాంగ్రెస్‌దేన‌ని రేవంత్ రెడ్డి మొన్న వ్యాఖ్య‌నించ‌డం దుమారం రేపింది. దానికి కౌంట‌ర్‌గా అర్వింద్ అండ‌ర్ వేర్ మాత్ర‌మే కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో కొనుక్కున్నాన‌ని రేవంత్‌కు కౌంట‌ర్ ఇచ్చాడు. అన్ని అయిపోయాయి తిట్టుకోవ‌డానికి. ఆఖ‌రికి అండ‌ర్ వేర్ వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయాయి. ఇక ఇంతకు మించి దిగ‌జారి పాతాళంలోకి ప‌డిపోయే అవ‌కాశం లేదేమో…

 

https://fb.watch/7UeM5_3j3q/

You missed