దళిత బంధువు
గౌడ బంధువు
ముదిరాజ్ బంధువు
గంగపుత్ర బంధువు
రజక బంధువు
నాయి బ్రాహ్మణ బంధువు
విశ్వకర్మ బంధువు
యాదవ బంధువు
గిరిజన బంధువు
పద్మశాలి బంధువు
వడ్డెర బంధువు
మున్నూరు కాపు బంధువు
ఆర్య వైశ్య బంధువు
రెడ్డి బంధువు
వెలమ బంధువు
ఇంకా మిగిలినవి మీ మీ వాల్ మీద తెలుపగలరు…..

ఒక‌రు ఫేస్‌బుక్ వాల్‌పై చేసిన పోస్ట్ ఇది. ద‌ళిత బంధువు పేరుతో వేల కోట్లు ఖ‌ర్చుపెడుతున్న ప్ర‌భుత్వానికి మేమేం పాపం చేశాం… మీమంతా బాగున్నామా? మా గురించీ ప‌ట్టించుకోండంటూ వ్యంగ్యంగా సంధించిన ఓ పోస్టు ఇది. దేశానికే ఆద‌ర్శంగా నిలుద్దామ‌ని కేసీఆర్ క‌ల‌లు కంటుంటూ ఈ కులాల గొడ‌వేందిరా బై అన్న‌ట్టుగా ఇది ఇది. వాస్త‌వంగా ద‌ళితుల క‌న్నా హీనంగా వివ‌క్ష‌కు గుర‌వుతున్న కులాలున్నాయి. సంచార జీవితాలు గ‌డుపుతున్నారు. వారికి ఓటు హ‌క్కు ఉండ‌దు. రేష‌న్ కార్డుండ‌దు. సొంతిండ్లూ ఉండ‌వు. ఏమీ లేకున్నా స‌రే గానీ ఓటు హ‌క్కు లేకుండా ఊర్లు ప‌ట్టుకుని తిరిగేవాళ్ల‌తో స‌ర్కారు ప‌నేంది? వారికి కావాల్సింది ఓట్లు. ఎన్నిక‌లు క‌దా.

ఇలా ప‌థ‌కాల పేరుతో తాయిలాల ఎర వేస్తారు. అవి తీసుకొని మ‌నం కీర్తిద్దాం.

అభిన‌వ అంబేద్క‌రు నువ్వేనంటూ పాలాభిషేకాలు చేద్దాం.

You missed