సంక్షేమ పథకాలు… బీసీల రిజర్వేషన్లు! కాంగ్రెస్‌కు రక్షణ కవచాలు! లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ రెండు అస్త్రాలతో గెలుపు తీరాలకు.. బీజేపీ, బీఆరెస్‌లకు దిమ్మదిరిగేలా బీసీల అస్త్రం ప్రయోగం.. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు లాభిస్తుందని లెక్కలేసుకుంటున్న బీఆరెస్.. బీజేపీ కొన్ని స్థానాలపైనే మాత్రమే గురి.. పెద్దగా ఆశలు పెట్టుకోని కమలనాథులు
(దండుగుల శ్రీనివాస్) లేటుగా వచ్చినా లేటెస్టుగా గెలుస్తామనేలా కాంగ్రెస్ లోకల్‌బాడీ ఎన్నికల్లో గెలుపు కోసం వినూత్నంగా ముందుకుపోతున్నది. కొన్ని నెలల క్రితం.. అటు బీఆరెస్, దాని మిత్రపక్షంగా కొనసాగుతున్న బీజేపీలు రెండూ స్థానిక ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత నానాటికీ…
