దెబ్బకు దెబ్బ.. ఎత్తుకు పైఎత్తు.. చిత్తుగా ఓడగొడతాం… రండిరా సూస్కుందాం…! మీ తాతలు దిగి వచ్చినా.. ముత్తాత్తలను ముందుకు తెచ్చినా… మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి చూపిస్తాం.. బీఆరెస్, బీజేపీలకు దిమ్మ దిరిగే ఫలితాలు సాధిస్తాం..! కిషన్‌రెడ్డిని నల్లికుట్ల మాటలు.. సీబీఐ, ఈడీ మీ జేబు సంస్థలు.. రాహుల్, సోనియాను వెంటాడుతున్నారు… వేధిస్తున్నారు.. మరి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఎందుకు అరెస్టు చే్యడం లేదు? భూపాలపల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్!
(దండుగుల శ్రీనివాస్) బీఆరెస్, బీజేపీలు వేర్వేరు కావని, ఈ రెండు పార్టీలు బొమ్మ బొరుసులాంటివని, వీరిది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల కోసం వీరెన్ని వేషాలు…
