దళితుల ఆశాజ్యోతి.. నాడు ఎన్టీఆర్.. నేడు రేవంత్! మోత్కుపల్లి మనసులో మాట…! ఎన్టీఆర్ తరువాత ఎస్సీల కోసం ఆలోచించింది రేవంత్ రెడ్డే! ఆయనకు దళితులంతా తోడుగా ఉంటారు.. ఇంకా పదేండ్లు సీఎంగా చూస్తారు!! అందె శ్రీ సంస్మరణ సభలో సీఎంను కొనియాడిన మోత్కుపల్లి నర్సింహులు
(దండుగుల శ్రీనివాస్) మోత్కుపల్లి నర్సింహులు.. చాలా రోజులైంది వేదికలెక్కి మాట్లాడి. అందె శ్రీ సంస్మరణ సభ సందర్బంగా ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఉన్నదున్నట్టుగా.. నిజాయితీగా ఆయన చేసిన వ్యాఖ్యలు మెచ్చుకోలుగా సాగాయి. అందె శ్రీ అంతిమ యాత్రలో రేవంత్…
